Manipur: మూడు నెలల తర్వాత మణిపూర్‌లో కీలక పరిణామం..

ABN , First Publish Date - 2023-07-25T17:23:40+05:30 IST

మైతేయీ, కుకీ జాతుల మధ్య వైరంతో దాదాపు మూడు నెలలుగా అట్టుడికిపోతున్న మణిపూర్‌లో (Manipur Violence) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటర్నెట్ సేవలను పాక్షికంగా పునరుద్ధరిస్తూ మణిపూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్రాండ్‌బ్యాండ్ సేవలు పొందేందుకు అనుమతినిచ్చింది. స్థిరమైన ఒకే ఒక్క ఐపీ కనెక్షన్ (static IP connection) ఉన్న ఇంటర్నెట్ పరిమితంగా వినియోగించుకోవచ్చని పేర్కొంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Manipur: మూడు నెలల తర్వాత మణిపూర్‌లో కీలక పరిణామం..

ఇంఫాల్: మైతేయీ, కుకీ జాతుల మధ్య వైరంతో దాదాపు 3 నెలలుగా అట్టుడికిపోతున్న మణిపూర్‌లో (Manipur Violence) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటర్నెట్ సేవలను పాక్షికంగా పునరుద్ధరిస్తూ మణిపూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్రాండ్‌బ్యాండ్ సేవలు పొందేందుకు అనుమతినిచ్చింది. స్థిరమైన ఒకే ఒక్క ఐపీ కనెక్షన్ (static IP connection) ఉన్న ఇంటర్నెట్ పరిమితంగా వినియోగించుకోవచ్చని పేర్కొంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేధాన్ని మాత్రం యథావిథిగా కొనసాగిస్తున్నట్టు తెలిపింది. ఇక సోషల్ మీడియా వినియోగానికి కూడా అవకాశం ఇవ్వడంలేదని స్పష్టం చేసింది.


బ్రాడ్‌బ్యాండ్ మినహా ఇతర రకాల కనెక్షన్ల ద్వారా ఇంటర్నెట్ వాడుతున్నారని గుర్తిస్తే సర్వీస్ ప్రొవైడర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది. ఏదైనా డివైజ్‌కి స్థిరమైన ఐపీ కేటాయిస్తే అది మారదు. ఎక్కువ డివైజ్‌లలో డైనమిక్ ఐపీలను వాడుతుంటారు. నెట్‌వర్క్‌కు కనెక్టవ్వడం ద్వారా అసైన్ అయ్యే ఈ ఐపీ మారుతుంటుంది. కాబట్టి స్థిరమైన ఐపీ ఏదో సులభంగా పర్యవేక్షించి గుర్తించవచ్చు. ఇక వైఫై హాట్‌స్పాట్‌లకు కూడా అనుమతి లేదు. సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌కి కూడా ఎలాంటి పర్మిషన్ లేదు. యూజర్లు కచ్చితంగా విర్చువల్ ప్రైవేటు నెట్‌వర్క్ (VPN) సాఫ్ట్‌వేర్‌ని తొలగించాల్సి ఉంటుంది. ఇక కొత్త వాటిని కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడానికి వీల్లేదని మణిపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Updated Date - 2023-07-25T17:24:18+05:30 IST