Home » Medak
కొందరిని చూసినా.. వారి గురించి విన్నా.. వీరెక్కడి మనుషులురా బాబూ అనిపిస్తుంటి. ఇప్పుడీ వార్త చదివితే అచ్చం అలాంటి అభిప్రాయం కలుగక మానదు. అవును.. 27 ఏళ్ల మహిళ.. 16 ఏళ్ల మైనర్ బాలుడిపై కన్నేసింది. ఆ పిల్లాడిని అన్ని రకాలుగా వాడుకుంది.
మూడు తులాల బంగారం కోసం వృద్ధులైన తల్లిదండ్రులను గొంతు పిసికి చంపాడో వ్యక్తి! మృతదేహాలను ఎవ్వరూ గుర్తించకుండా ఉండేందుకు పెట్రోలు పోసి తగులబెట్టి.. కన్నవారు కనిపించడం లేదంటూ స్థానికులకు చెప్పుకొని ఏడ్చాడు!
లోక్‌సభ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో సెంటిమెంట్‌కు బ్రేక్ పడింది. ఒక పార్టీ ఒక స్థానం నుంచి వరుసగా రెండో, మూడోసారి నెగ్గదనే చర్చకు తెరపడింది. 1999 నుంచి సికింద్రాబాద్‌లో ఒకే పార్టీ వరుసగా మూడుసార్లు గెలవలేదు. 1999లో బీజేపీ, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాయి.
లోక్‌సభ ఎన్నికలు ముఖ్య నేతలు కొందరికి మోదాన్ని, మరి కొంత ఖేదాన్ని మిగిల్చాయి. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఇలాకా పాలమూరులో కాషాయ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ ఖిల్లా మెదక్‌లోనూ కమలం వికసించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో మరింత దయనీయ స్థితికి దిగజారింది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఈసారి లోక్‌సభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది. ఏకంగా ఏడు స్థానాల్లో గులాబీ పార్టీ డిపాజిట్ కోల్పోయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. లోక్‌సభ ఫలితాలపై ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ ప్రభావం ఏమాత్రం తగ్గదని, తాము ఆశించిన 12 స్థానాల్లో అంచనాలు కొంత అటు ఇటు అయినా.. ఆరు స్థానాల్లో మాత్రం గెలుపు అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది.
శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదగిరిగుట్టపై పాత ఆచారాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రధానాలయ ఉద్ఘాటనకు ముందు స్థానిక భక్తులకు గర్భాలయ (అంతరాలయ) దర్శనం ఉండేది. 2022 మార్చి 28న ఉద్ఘాటన అనంతరం కొండపైన ఉన్న పాత ఆచారాలు అన్నిటినీ గత ప్రభుత్వం పక్కనపెట్టింది.
లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలైనా.. తొలి రౌండ్ ఫలితం కోసం కొంత ఎదురుచూపులు తప్పవు. ఈవీఎంలు తెరవడం.. వాటిని టేబుళ్లపై చేర్చడం.. లెక్కించడం.. సరిపోల్చుకోవడం.. వాటిని రిటర్నింగ్ అధికారి నిర్ధారించుకొని ఫలితాన్ని ప్రకటించడం.. వీటన్నింటికీ గంటన్నర పట్టే అవకాశం ఉంది.
వానాకాలం సాగుకు అవసరమైన జీలుగ విత్తనాల కోసం రైతులకు అవస్థలు తప్పడం లేదు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో ఆగ్రోస్ కేంద్రానికి మంగళవారం రాత్రి 560 బస్తాల సబ్సిడీ జీలుగ విత్తనాలు సరఫరా చేశారు. విషయం తెలియగానే రైతులు బుధవారం ఉదయం అక్కడికి చేరుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వానకు ప్రజలు వణికిపోయారు. గాలివాన తీవ్రత ఉమ్మడి పాలమూరులో ఎక్కువగా ఉంది..! నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు కొమ్ముగుట్టలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు గోడ కూలి నలుగురు మృతి చెందారు.