Share News

Toopran: జీలుగ విత్తనాల కోసం క్యూలో చెప్పులు

ABN , Publish Date - May 30 , 2024 | 05:16 AM

వానాకాలం సాగుకు అవసరమైన జీలుగ విత్తనాల కోసం రైతులకు అవస్థలు తప్పడం లేదు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణంలో ఆగ్రోస్‌ కేంద్రానికి మంగళవారం రాత్రి 560 బస్తాల సబ్సిడీ జీలుగ విత్తనాలు సరఫరా చేశారు. విషయం తెలియగానే రైతులు బుధవారం ఉదయం అక్కడికి చేరుకున్నారు.

Toopran: జీలుగ విత్తనాల కోసం క్యూలో చెప్పులు

  • తూప్రాన్‌ రైతులకు తప్పని అవస్థలు

  • సరిపడా విత్తనాలు లేవంటూ రైతుల రాస్తారోకో

తూప్రాన్‌, మే 29: వానాకాలం సాగుకు అవసరమైన జీలుగ విత్తనాల కోసం రైతులకు అవస్థలు తప్పడం లేదు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణంలో ఆగ్రోస్‌ కేంద్రానికి మంగళవారం రాత్రి 560 బస్తాల సబ్సిడీ జీలుగ విత్తనాలు సరఫరా చేశారు. విషయం తెలియగానే రైతులు బుధవారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. రైతులు ఆగ్రోస్‌ కేంద్రం తెరిచే వరకు అక్కడ నిలబడలేక చెప్పులను క్యూలో పెట్టారు. వ్యవసాయ అధికారి గంగుమల్లు, ఏఈవోలు సంతో్‌షకుమార్‌, సింధు రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు.


ఓ వైపు పంపిణీ జరుగుతుండగానే జీలుగ విత్తనాలు సరిపడా లేవంటూ కొందరు రైతులు తూప్రాన్‌ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. తమకు జీలుగ విత్తనాలు అందించడంలేదంటూ వారు ఆరోపించారు. అయితే మధ్యాహ్నం వరకు పంపిణీ చేయగా 170 బస్తాల జీలుగ విత్తనాలు ఇంకా మిగిలినట్లు ఏవో గంగుమల్లు తెలిపారు. రైతుల ఆందోళనతో మరో వెయ్యి బస్తాల జీలుగ విత్తనాలను ఆర్డర్‌ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Updated Date - May 30 , 2024 | 05:16 AM