Home » Medical News
కొన్ని శాఖలు ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పూర్తి చేయకపోవడం, వైద్య ఆరోగ్య శాఖ బదిలీల్లో తీవ్ర గందరగోళం చోటుచేసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సాధారణ బదిలీలకు మరో 10 రోజుల గడువు ఇచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా స్పెషాలిటీ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎ్‌స, ఆరోగ్య భద్రత కార్డులపై నగదు రహిత వైద్య సేవలను కొనసాగిస్తామని తెలంగాణ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (తాషా) వెల్లడించింది.
వైద్య ఆరోగ్యశాఖలో సాధారణ బదిలీల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సీనియారిటీ జాబితాలో లోపాలపై స్టాఫ్‌నర్స్‌లు ఆందోళనకు దిగడంతో వారి కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం కూడా నిర్వహించలేదు. తాజాగా డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్), ఫార్మసీ, ల్యాబ్, ఏఎన్ఎం, ఎంపీహెచ్‌డబ్ల్యూ (మేల్, ఫీమెల్)వంటి విభాగాల్లోనూ బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్స్‌ల బదిలీల కోసం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌లో శుక్రవారం గందరగోళ పరిస్థితి నెలకొంది. బదిలీల ప్రక్రియలో లోపాలున్నాయని, తమకు అన్యాయం జరుగుతోందంటూ నర్సింగ్ ఆఫీసర్స్ కౌన్సెలింగ్ ప్రక్రియను అడ్డుకోవడమేకాకుండా ఆందోళనకు దిగారు.
వైద్య కళాశాలల ప్రొఫెసర్ల బదిలీలను ఆపాలని సీనియర్ రెసిడెంట్ వైద్య విద్యార్థులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల సూపర్ స్పెషాలిటీ ప్రొఫెసర్ల బదిలీల కారణంగా ఓ వైపు వైద్యసేవలపై, మరోవైపు బోధనపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు పేర్కొన్నారు.
నారోగ్యాన్ని నయం చేస్తానని నమ్మబలికిన ఓ తాంత్రికుడు.. 19 ఏళ్ల యువతి ప్రాణాలతో చెలగాటమాడాడు. వైద్యం పేరిట ఆ యువతి తలలో ఏకంగా 70 సూదులు గుచ్చేశాడు.
జీవో 317కు సంబంధించి ఉద్యోగుల వినతులపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది.
ములుగు జిల్లా: డీఎంహెచ్‌వో డా. అప్పయ్య తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆదివాసులకు వైద్యం అందించారు. కొండ కోణల్లో ఉండే గిరి పుత్రులు జ్వరాలతో బాధ పడుతూ మెరుగైన వైద్యానికి నోచుకోక.. వారు బయటకు రాలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి అప్పయ్య నేరుగా తానే ఆదివాసుల దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 8 మెడికల్ కాలేజీలకు అనుమతులివ్వబోమని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) స్పష్టం చేసిన నేపథ్యంలో తమకు మరో అవకాశం ఇవ్వాలని సర్కారు అప్పీల్‌కు వెళ్లింది.
వైద్య ఆరోగ్యశాఖలో గురువారం బదిలీల ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో కొందరు ఉద్యోగులు ఉన్నచోటనే కొనసాగేందుకు కొత్త మోసానికి తెరలేపారు.