Home » Metro News
ట్రాఫిక్ నుంచి విముక్తి కోసం ఇప్పుడు ప్రతి ఒక్కరూ మెట్రోను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు సదుపాయం అందుబాటులోకి వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా ఎక్కేవారు కాదు. దీంతో నష్టాల బాటలో నడిచేది. ఆ తరువాత క్రమక్రమంగా పుంజుకుంది. జంట నగరాల్లో ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తికి మెట్రో ఒక్కటే పరిష్కార మార్గంగా కనిపించింది. దీంతో మెట్రో రైలుకు జనాలు అలవాటు పడ్డారు.
‘‘బస్సు ప్రయాణాన్ని (మహిళలకు) ఉచితం చేశారు. మెట్రోను ఖాళీ చేశారు. మరిప్పుడు మెట్రో ఎలా నడుస్తుంది? దేశం ఎలా ముందుకు సాగుతుంది?’’ ..అంటూ ప్రధాని మోదీ కర్ణాటక, తెలంగాణలో అమలవుతున్న ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ పథకంపై పరోక్ష విమర్శలు చేశారు!
లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మెట్రో రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి(Hyderabad Metro Rail MD NVS Reddy) అన్నారు.
అనతికాలంలోనే మెట్రోరైలు(Metro Rail) అమిత ప్రజాదరణ పొందింది. ట్రాఫిక్, కాలుష్య రహితమైన ప్రయాణాన్ని అందిస్తూ విభిన్నవర్గాలకు చేరువైంది. మెరుగైన రవాణాను అందిస్తోంది. తొలిరోజుల్లో సగటున 1.60 లక్షల నుంచి 2.10 లక్షల మంది రాకపోకలు సాగించగా, ప్రస్తుతం 4.80 లక్షల నుంచి 5.10 లక్షల వరకు ప్రయాణిస్తుండడం ఆసక్తికరంగా మారింది.
వందే భారత్ రైళ్లతో దేశీయ రైల్వే రంగంలో పెను మార్పులు రాగా.. ఇప్పుడు వందేభారత్ సేవలను మెట్రోలకు కూడా విస్తరించాలని చూస్తున్నారు అధికారులు. పంజాబ్‌లోని కపుర్తలాలోని రైలు కోచ్ ఫ్యాక్టరీ వందే భారత్ మెట్రో రైలు కోచ్‌లను విడుదల చేసింది. ఈ ఏడాది జులైలో వందే భారత్ మెట్రోను పరీక్షించనున్నారు.
గ్రేటన్ హైదరాబాద్‌లోని ఇన్నర్ రింగ్‌రోడ్‌లో.. ఎక్కడి నుంచైనా రూ.200లోపు ఖర్చుతో మెట్రోలో శంషాబాద్‌కు వెళ్లేలా హెచ్ఎంఆర్ఎల్ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.