Home » Mizoram
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు వినూత్న తీర్పునిచ్చారు. ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, అధికార మిజో నేషనల్ ఫ్రంట్‌ను వెనక్కి నెట్టేసింది. లాల్ దహోమా సారథ్యంలోని జోరామ్ పీపుల్స్ మూవ్‌వెంట్ 40 స్థానాల్లో 27 స్థానాలు గెలుచుకుని అధికారం ఖాయం చేసుకోగా, ఎంఎన్ఎఫ్ 10 సీట్లకే పరిమితమైంది.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అయిన జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ దూసుకుపోతోంది. 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీకి నవంబర్ 7న పోలింగ్ జరగ్గా.. 80 శాతానికి పైగానే పోలింగ్ నమోదైంది. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పాటు ఆదివారమే మిజోరం కౌంటింగ్ కూడా జరగాల్సి ఉంది.
మిజోరం ఎన్నికల(Mizoram Assembly Elections 2023) ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. కౌంటింగ్ కేంద్రాల నుండి ముందస్తు లీడ్‌లు రావడంతో, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ZPM, ముఖ్యమంత్రి జోరంతంగా(Zoramthanga) నేతృత్వంలోని అధికార MNF కంటే ముందుంది.
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తయిన ఒక రోజు తరువాత ఇవాళ ఉదయం 8 గంటలకు మిజోరం(Mizoram Assembly Elections 2023) రాష్ట్ర ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
భారత్‌లో అతి తక్కువ నియోజకవర్గాలున్న రాష్ట్రం మిజోరం. ఇక్కడ కేవలం 40 అసెంబ్లీ స్థానాలే ఉన్నాయి. మిజోరంలో అధికారం చేపట్టడానికి మేజిక్ ఫిగర్ 21 స్థానాలు సాధించాలి. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలైన జోరం పీపుల్స్ మూమెంట్(ZPM), మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) బరిలో ఉన్నాయి. అయితే బీజేపీ మాత్రం రాష్ట్రంలో ఆశించినంత బలంగా లేదని పొలిటికల్ నిపుణులు చెబుతున్నారు.
మిజోరం, ఛత్తీస్‌గఢ్ తొలి విడత పోలింగ్ ముగిసింది. మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 5 గంటల వరకూ 77.04 శాతం పోలింగ్ నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతగా 20 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా, 70.87 శాతం పోలింగ్ నమోదైంది.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నక్సలైట్లు జరిపిన ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్) పేలుళ్లలో పోలింగ్ విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్(సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) జవాన్ గాయపడ్డారు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా తెలిపారు.
దేశంలో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల ఓటర్లు నేడు ఓటు వేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 60 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ మొదలైంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఛత్తీస్‌గఢ్ లో తొలి విడత పోలింగ్, మిజోరంలో ఒకే విడతలో పోలింగ్ పూర్తిచేయడానికి రంగం సిద్ధమైంది. ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి విడతగా 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మిజోరంలో మొత్తం 40 స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది.
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న మిజోరంలోని మమిత్ లో అక్టోబర్ 30న జరిగే ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనాల్సి ఉండగా ఆయన పర్యటన రద్దయింది. మోదీకి బదులుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మమిత్‌లో ప్రచారం చేపడతారని పార్టీ ప్రతినిధి తెలిపారు.