Home » MLA Candidates
రైతులకు రుణమాఫీ అమలవుతుందన్న బెంగతో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావుకు కన్నీళ్లు ఆగట్లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
చెరువులు, నాలాల ఆక్రమణల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెందిన కళాశాలలకు నోటీసులు జారీ చేసింది.
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన విద్యా సంస్థల భూమి పత్రాలను పరిశీలించాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది.
గ్రేటర్ హైదరాబాద్‌లోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా పరిధిని
‘‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం అయ్యింది. ఈ పర్యటన తెలంగాణ మార్పునకు నాంది పలకబోతోంది.
సమయం, సందర్భాన్ని బట్టి కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాలూ రద్దు కావచ్చునని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ తొలి శాసనసభలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా కుర్చీలో నుంచి లేచి నిలుచున్నారన్న కారణంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ సభ్యత్వాలను రద్దు చేశారని, అప్పుడు వారు స్పీకర్ పోడియం వద్దకు కూడా వెళ్లలేదని.. 2014 నుంచి 2018 వరకూ ఏ ఒక్క సమావేశంలోనూ తనను ఉండనీయ లేదని, సభకు వచ్చిన వెంటనే తీసుకెళ్లి బయటకు తోసేశారని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ఏటీఎంలా వాడుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకునే ప్రయత్నం చేస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.
పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసేందుకు శనివారం అపాయింట్మెంట్ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కాంగ్రె్‌సలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి.. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు.
కాంగ్రె్‌సలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా శనివారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సైతం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు.