Share News

Congress: హైడ్రా పరిధిని విస్తరించండి..

ABN , Publish Date - Aug 26 , 2024 | 03:18 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా పరిధిని

Congress: హైడ్రా పరిధిని విస్తరించండి..

  • జిల్లాల్లోనూ అక్రమ నిర్మాణాల్ని తొలగించండి

  • హుస్సేన్‌సాగర్‌లో కబ్జాలపై చర్యలు చేపట్టండి

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి

  • ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే అడ్లూరి వినతి

హైదరాబాద్‌, జగిత్యాల అర్బన్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌లోని చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా పరిధిని రాష్ట్రస్థాయికి విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ కోరారు. వారిద్దరు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న హుసేన్‌ సాగర్‌ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లలోని అక్రమ నిర్మాణాలు, వ్యాపార సంస్థలనూ తొలగించాలన్నారు.


ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి వారు లేఖ కూడా రాశారు. సీఎం రేవంత్‌ రెడ్డి జంట నగరాల్లో ఆక్రమణల తొలగింపునకు తీసుకున్న నిర్ణయం, హైడ్రా చట్టం అమలు చేయడం అభినందనీయం అన్నారు. ఈ నిర్ణయంతో జంట నగరాల ప్రజలు, పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ చట్టాన్ని జంట నగరాలకే పరిమితం చేయకుండా జిల్లా, పట్టణ కేంద్రాలకు విస్తరింపజేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. హైడ్రా పరిధి పెంచలేని పక్షంలో కలెక్టర్‌, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టాలని వారు కోరారు.

Updated Date - Aug 26 , 2024 | 03:18 AM