Home » MLA Candidates
అన్యాయంపై న్యాయం విజయకేతనం ఎగురవేసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా నెల్లూరులో శనివారం ‘థ్యాంక్స్ టూ గాంధీజీ’ పేరుతో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు
విజయవాడ: ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మంగళవారం ఉదయం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే లతో సమావేశం అయ్యారు. శాసన సభ పక్ష నేత ఎంపికపై చర్చలు జరుపుతున్నారు. అధిష్టానం ప్రకటనకు అందరూ కట్టుబడి ఉండాలని నిర్ణయించారు.
లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం మొదలుకానుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ శాసన సభ్యులు కాంగ్రె్‌సలోకి వెళ్లేందుకు మంతనాలు ప్రారంభించారు. వచ్చే ఐదేళ్ల పాటు సౌకర్యంగా ఉండే ఆలోచనతో కొందరు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బీజేపీతో బేరసారాలు చేసుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికైనా అలోచించి.. ఆత్మప్రభోధానుసారం నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలు ఆత్మబలిదానం చేసుకుని.. అవయవదానం చేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించారని అన్నారు.
ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాలు
పాతికమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. ఆయన చెప్పింది జరిగితే ఆయనకు సన్మానమూ చేస్తానని చెప్పారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బీఆర్‌ఎ్‌సలో చిచ్చు పెట్టింది. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించి, ‘గెలిపించుకు రండి’ అంటే ఎలా కుదురుతుందంటూ అధిష్ఠానంపై గులాబీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్నబాస్ కేటీఆర్ నిర్వహించిన సమావేశాన్ని పలువురు నేతలు బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 27న జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఉపఎన్నికకు అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్‌ఎ్‌సలో చేరిన ఏనుగుల రాకేశ్ రెడ్డిని అధిష్ఠానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
ఏపీలో ఓట్ల పండుగకు సర్వం సిద్ధమైంది. ఓ వైపు ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తుంటే.. మరోవైపు అభ్యర్థులు చివరి రెండు రోజుల్లో చేయాల్సిన పనిని పూర్తిచేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్లకు డబ్బుల పంపిణీని ప్రారంభించారు. నియోజకవర్గం స్వరూపాన్ని, అభ్యర్థి ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి నోట్ల పంపిణీని ప్రారంభించారు. ఇప్పటిరకు గరిష్టంగా ఓటుకు 3వేలు ఇస్తుండగా.. కనిష్టంగా రూ.1000 ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ(YCP) అధినేత జగన్‌కు(YS Jagan) బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే. పి.గన్నవరం(P.Gannavaram) ఎమ్మెల్యే కొండేటి చిట్టబాబు(Kondeti Chittibabu) వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్(Congress) పార్టీలో చేరారు. పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన.. నేరుగా జమ్మలమడుగు వచ్చి ..
TDP To YSR Congress: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ కీలక పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు అటు ఇటు జంప్ అవుతుండగా.. అభ్యర్థుల జాబితా.. ఎన్నికల షెడ్యూల్ రావడంతో మరింత ఎక్కువయ్యాయి. ఇకనైనా అధిష్టానం ఆలోచించి టికెట్ ఇస్తుందేమోనని వేచి చూసిన నేతలు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పేస్తున్నారు..