Home » MLC Elections
వరంగల్- ఖమ్మం- నల్లగొండ, కరీంనగర్- మెదక్- ఆదిలాబాద్- నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారని, అనేకచోట్ల పీడీఎఫ్ తరఫున ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించారని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు.
రాష్ట్రంలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గురువారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతోపాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓటేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
మొత్తం మూడు స్థానాలకు పోలింగ్ జరిగినప్పటికీ.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అందరిదృష్టి ఆకర్షిస్తోంది. మొత్తం 56 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీతో పాటు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి మధ్య తీవ్రపోటీ..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా, నస్పూర్ మున్సిపాలిటీలోని తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎస్ఐ కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని స్థానిక బీజేపీ నేత కమలాకరరావు పేర్కొంటూ ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఎస్ఐ బీజేపీ నేతపై దాడి చేశారంటూ బీజేపీ కార్కకర్తలు ఆందోళనకు దిగారు.
ఏపీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓటు హక్కు వినియోగించుకుని బయటకు వచ్చిన సీఎం చంద్రబాబుతో మాట్లాడేందుకు స్థానికులు ఆసక్తి కనపరిచారు. సరదాగా, ఆప్యాయంగా వారితో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని.. ఓటు వేయడం మన బాధ్యతని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. భారత దేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యమని.. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది పెద్ద ఆయుధమని ఆయన అన్నారు.
తెలంగాణలో రెండు టీచర్స్, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబద్, మెదక్ పట్టభద్రుల స్థానంలో గెలుపు ఎవరిదనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడ చతుర్ముఖ పోటీ నెలకొంది.