MLC Election: కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ సీటులో ఆలపాటి హవా
ABN , Publish Date - Mar 04 , 2025 | 04:28 AM
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమికే గ్రాడ్యుయేట్లు జై కొట్టారు.

కూటమి అభ్యర్థి ఆలపాటికి ఐదో రౌండ్ తర్వాత 47,872 ఓట్ల మెజారిటీ
తొలి ప్రాధాన్య ఓట్లలో భారీ ఆధిక్యం
లెక్కింపు ముగిసేసరికి లక్ష దాటే చాన్సు?
గుంటూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమికే గ్రాడ్యుయేట్లు జై కొట్టారు. కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ జిల్లాల్లో కూటమి క్లీన్‌స్వీ్‌ప చేసేసింది. దాదాపుగా అదే వాతావరణం ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కనిపిస్తోంది. గత నెల 27వ తేదీన జరిగిన పోలింగ్‌లో 2,41,493 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 371 అందాయి. సోమవారం గుంటూరు ఏసీ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ హాలులో ఓట్ల లెక్కింపునకు 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై వెయ్యి ఓట్ల చొప్పున ఒక్కో రౌండ్‌లో 28 వేల ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఐదు రౌండ్లు ముగిసేటప్పటికి సమీప ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుపై ఆయన ఐదో రౌండ్‌కు 47,872 ఓట్ల ఆధిక్యం సంపాదించారు. అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి మెజారిటీ లక్ష దాటవచ్చని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. తొలి రెండు రౌండ్లలో ఆలపాటికి 34,721 ఓట్లు రాగా.. లక్ష్మణరావుకు 13,956 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఐదోరౌండ్‌లో ఆలపాటికి 16,916, లక్ష్మణరావుకు 7,535 ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ మంగళవారం ఉదయానికి పూర్తవుతుందని అంటున్నారు.ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమికే గ్రాడ్యుయేట్లు జై కొట్టారు. కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ జిల్లాల్లో కూటమి క్లీన్‌స్వీ్‌ప చేసేసింది. దాదాపుగా అదే వాతావరణం ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కనిపిస్తోంది.
గత నెల 27వ తేదీన జరిగిన పోలింగ్‌లో 2,41,493 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 371 అందాయి. సోమవారం గుంటూరు ఏసీ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ హాలులో ఓట్ల లెక్కింపునకు 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై వెయ్యి ఓట్ల చొప్పున ఒక్కో రౌండ్‌లో 28 వేల ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఐదు రౌండ్లు ముగిసేటప్పటికి సమీప ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుపై ఆయన ఐదో రౌండ్‌కు 47,872 ఓట్ల ఆధిక్యం సంపాదించారు. అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి మెజారిటీ లక్ష దాటవచ్చని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. తొలి రెండు రౌండ్లలో ఆలపాటికి 34,721 ఓట్లు రాగా.. లక్ష్మణరావుకు 13,956 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఐదోరౌండ్‌లో ఆలపాటికి 16,916, లక్ష్మణరావుకు 7,535 ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ మంగళవారం ఉదయానికి పూర్తవుతుందని అంటున్నారు.