Share News

AP MLC Eletions: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు.. గెలుపు ఎవరిదంటే..

ABN , Publish Date - Mar 03 , 2025 | 10:07 PM

AP MLC Eletions: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు ఘన విజయం సాధించారు. ఇక కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధిక్యంలో ఉన్నారు. పలు రౌండ్లలో ఆయన స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోన్నారు.

AP MLC Eletions: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు.. గెలుపు ఎవరిదంటే..

అమరావతి, మార్చి 03: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు ఘన విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓటుతో గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. మొత్తం 20,791 ఓట్లు పొలవగా.. వాటిలో చెల్లినవి 20,135, ఇక చెల్లని ఓట్లు 656గా ఉన్నాయి. అయితే గాదె శ్రీనివాసులు నాయుడుకు మెుత్తం 12,035 ఓట్లు పోలైనాయి. మరికాసేపట్లో ఈ ఫలితాన్ని ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.

గతంలో రెండు పర్యాయాలు టీచర్స్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు నాయుడు ఎన్నికయ్యారు. ముచ్చటగా మూడోసారి టీచర్స్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు నాయుడు విజయ కేతనం ఎగురవేశారు. మరికాసేపట్లో ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడనున్నారు. ఇక కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధిక్యంతో కొనసాగుతోన్నారు. ఇప్పటికే పలు రౌండ్ల కౌంటింగ్ జరిగింది. వాటి అన్నింటిలో ఆలపాటి రాజా దాదాపు 30 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోన్నారు.

మరోవైపు తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపొందారు. అలాగే నల్గొండలో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. మరో ఎమ్మెల్సీ స్థానం ఫలితం తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: చిట్‌ఫండ్స్ బాధితులను ఆదుకొనే దిశగా చర్యలు

Also Read : ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు

Also Read: సీఎం మార్పు తథ్యం.. ఎప్పటి లోగా అంటే..

Also Read: ఈ పని చేస్తే.. ప్రభుత్వ పథకాలు ఫట్

Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్

Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 03 , 2025 | 10:14 PM