Home » Modi 3.0 Cabinet
భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం కోసం ఒకేసారి 71మందికి తన కేబినెట్‌లో ప్రధాని మోదీ చోటు కల్పించారు. ప్రమాణం చేసిన రెండోరోజే కేంద్రప్రభుత్వంలోని కీలక శాఖలు పరుగు ప్రారంభించేశాయి. రాబోయే వంద రోజుల కోసం కార్యాచరణ ప్రణాళిలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి.
కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు రెండు కీలక పదవులు దక్కాయి. కేంద్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే బొగ్గు, గనుల శాఖను కిషన్‌రెడ్డికి కేటాయిస్తూ ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతలను పరిరక్షించే హోంశాఖకు సహాయ మంత్రిగా బండి సంజయ్‌ని నియమించారు.
ముచ్చటగా మూడో సారి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కేబినెట్ కూడా జూన్ 9న మిగతా మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా రాష్ట్రపతి భవన్‌లో అట్టహసంగా జరిగింది. అయితే సోమవారం మంత్రులతో ప్రధాని మోదీ తొలిసారి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మంత్రులకు ఇచ్చే శాఖలపై క్లారిటీ వచ్చింది
ప్రధానిగా మోదీ జూన్ 9న మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఓ మంత్రి ప్రమాణం చేస్తున్నప్పుడు ఆయన వెనక ఓ చిరుత రావడం కనిపించింది. ఎంపీ దుర్గాదాస్ సంతకాలు పెట్టి పేపర్‌వర్క్ పూర్తి చేసి కుర్చీలోంచి లేచారు.
కేంద్ర మంత్రులకు ఇచ్చే శాఖలపై క్లారిటీ వచ్చింది. అయితే చాలా శాఖలకు పాత వారినే కొనసాగించారు. వివిధ శాఖలకు మారిన మంత్రులెవరు, కొత్త మంత్రులెవరు అనేది తెలుసుకుందాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన కేబినెట్ సమావేశమైంది. న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో సోమవారం నిర్వహించిన ఈ సమావేశానికి 71 మంది మంత్రులు హాజరయ్యారు.
కేంద్రంలో మోదీ(PM Modi) ప్రభుత్వం మూడోసారి కొలువుదీరిన తరుణంలో ప్రతిపక్షాలు ఆయన సర్కార్‌పై విరుచుకుపడుతున్నాయి. మిత్రపక్షాల సాయంతో కొలువుదీరిన సంకీర్ణ సర్కార్.. ఏడాదిలో కూలిపోతుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీతోపాటు కేబినెట్ మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేయడంతో.. మూచ్చటగా మూడో సారి ఆయన ప్రభుత్వం కేంద్రంలో కోలువు తీరింది.
దేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. మరుసటి రోజు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. సౌత్ బ్లాక్‌లోని పీఎంవోలో మోదీ బాధ్యతలు స్వీకరించారు.
ప్రధాని నరేంద్ర మోదీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశ ప్రధానిగా వరుసగా మూడో సారి ప్రమాణం స్వీకారం చేసిన మోదీజీకి అభినందనలు’ అని పేర్కొన్నారు.