Amitshah takes charge: మోదీ 3.0లో అమిత్‌షా తొలి ప్రాధాన్యత ఏమిటంటే..
ABN , Publish Date - Jun 11 , 2024 | 02:39 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర హోం మంత్రిగా రెండోసారి అమిత్‌షా మంగళవారంనాడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2019 నుంచి ఆయన హోం మంత్రిగా ఉన్నారు. తిరిగి మోదీ 3.0 ప్రభుత్వంలోనూ అదే శాఖలో ఆయన కొనసాగుతున్నారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర హోం మంత్రిగా రెండోసారి అమిత్‌షా (Amit shah) మంగళవారంనాడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2019 నుంచి ఆయన హోం మంత్రిగా ఉన్నారు. తిరిగి మోదీ 3.0 ప్రభుత్వంలోనూ అదే శాఖలో ఆయన కొనసాగుతున్నారు. కొత్తగా రూపొందించిన క్రిమినల్ చట్టాలు -భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియం 2023లను తక్షణం అమల్లోకి తీసుసురావడం ఆయన ప్రాధాన్యతా క్రమాల్లో ఒకటిగా ఉంది.
అమిత్‌షా 2019లో 370వ అధికరణ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తీసుకురావడంలో మోదీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. ఈసారి పదవీకాలంలో భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అండ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానే మరింత సమర్ధవంతమైన చట్టాలను అమల్లోకి తీసుకు రావడంపై దృష్టి సారించనున్నారు. గత ఐదేళ్లలో ఈశాన్య ప్రాంతాల్లో వ్యూహాత్మక శాంతి ఒప్పందాల ద్వారా శాంతి పునరుద్ధరణ, మావోయిస్టుల హింసాకాండకు ముకుతాడు వేయడాని గట్టి కృషి చేశారు. బీజేపీ సిద్ధాంతాల పట్ల అంకితభావం, పార్టీ ఎదుగుదలలో కీలక భూమిక పోషించిన అమిత్‌షా ప్రధానమంత్రి మోదీ తర్వాత రెండవ కీలక వ్యక్తిగా ఎదిగారు.