Modi 3.0: మోదీ కేబినెట్.. తెలుగు వారి శాఖలు !
ABN , Publish Date - Jun 10 , 2024 | 06:11 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన కేబినెట్ సమావేశమైంది. న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో సోమవారం నిర్వహించిన ఈ సమావేశానికి 71 మంది మంత్రులు హాజరయ్యారు.
న్యూఢిల్లీ, జూన్ 10: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన కేబినెట్ సమావేశమైంది. న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో సోమవారం నిర్వహించిన ఈ సమావేశానికి 71 మంది మంత్రులు హాజరయ్యారు. అయితే 100 రోజుల్లో కొత్త ప్రభుత్వ నిర్దేశించుకున్న లక్ష్యాలపై ఈ సందర్బంగా కొత్త మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు.. శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మను మోదీ.. తన కేబినెట్‌లోకి తీసుకున్నారు.
Also Read: Amitabh Bachchan: 40 ఏళ్ల తర్వాత.. ?
వీరికీ ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై సర్వత్ర చర్చ వాడి వేడిగా నడుస్తుంది. మరోవైపు తమకు రైల్వే, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఆరోగ్య, జలశక్తి శాఖల్లో ఏవైనా తమకు ఇవ్వాలని బీజేపీ అగ్రనేతలను ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కోరినట్లు ఓ ప్రచారం అయితే రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతుంది. రాజధాని అమరావతి నిర్మాణం అనుకున్న విధంగా.. అనుకున్న సమయానికి పూర్తి కావాలంటే.. పట్టణాభివృద్ధి శాఖ అయితే మంచిదనే అభిప్రాయంలో టీడీపీ శ్రేణులు ఉన్నట్లు తెలుస్తుంది.
Also Read: LokSabha Election Result: రేపు రాయ్‌బరేలీకి రాహుల్, ప్రియాంక..?
అలాగే ఆంధ్రుల జీవనాడి.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావాలంటే.. జలశక్తి శాఖ అయితే కరెక్ట్ అనే వాదన సైతం పార్టీలో వాడివేడిగా జరుగుతున్నట్లు సమాచారం. అలాంటి వేళ... ఏ ఏ శాఖలు తమ ఎంపీలకు కేటాయిస్తారని ఆంధ్రులు తీవ్ర ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు, కేరళలో ఒకరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరికీ సైతం ఏ శాఖలు కేటాయిస్తారనే చర్చ సాగుతుంది. ఏదీ ఏమైనా ఈ రోజు రాత్రికి ఏ మంత్రికి ఏ శాఖ కేటాయించారనే అంశంపై ఓ స్పష్టత రానుందని తెలుస్తుంది.
Also Read: Modi 3.0: 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు..!
Read More National News and Latest Telugu News