Share News

Modi 3.0 Cabinet: కేంద్ర మంత్రివర్గ కూర్పు.. మారినవి, మార్పు లేని శాఖలివే..

ABN , Publish Date - Jun 10 , 2024 | 09:10 PM

కేంద్ర మంత్రులకు ఇచ్చే శాఖలపై క్లారిటీ వచ్చింది. అయితే చాలా శాఖలకు పాత వారినే కొనసాగించారు. వివిధ శాఖలకు మారిన మంత్రులెవరు, కొత్త మంత్రులెవరు అనేది తెలుసుకుందాం.

Modi 3.0 Cabinet: కేంద్ర మంత్రివర్గ కూర్పు..  మారినవి, మార్పు లేని శాఖలివే..

ఢిల్లీ: ముచ్చటగా మూడో సారి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కేబినెట్ కూడా జూన్ 9న మిగతా మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా రాష్ట్రపతి భవన్‌లో అట్టహసంగా జరిగింది. అయితే సోమవారం మంత్రులతో ప్రధాని మోదీ తొలిసారి భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మంత్రులకు ఇచ్చే శాఖలపై క్లారిటీ వచ్చింది. అయితే చాలా శాఖలకు పాత వారినే కొనసాగించారు. వివిధ శాఖలకు మారిన మంత్రులెవరు, కొత్త మంత్రులెవరు అనేది తెలుసుకుందాం.


మంత్రులు మార్పు లేని శాఖలు

  • రక్షణ శాఖ... రాజ్ నాథ్ సింగ్

  • హోం శాఖ.. అమిత్ షా

  • విదేశీ వ్యవహారాలు.. జైశంకర్

  • ఆర్ధిక శాఖ..నిర్మలా సీతారామన్

  • రోడ్లు రహదారులు..నితిన్ గడ్కరీ

  • వాణిజ్యం.. పీయూష్ గోయల్

  • విద్యాశాఖ.. ధర్మేంద్ర ప్రదాన్

  • అటవీశాఖ.. భూపేంద్ర యాదవ్

  • గిరిజన శాఖ.. జ్యువల్ ఓరం

  • ఓడరేవులు, షిప్పింగ్‌ - సర్బానంద సోనోవాల్‌

  • న్యాయశాఖ.. అర్జున్ రామ్ మేఘవాల్

  • రైల్వే, ఐటీ, సమాచార ప్రసార శాఖ..అశ్విని వైష్ణవ్


మారిన శాఖలు

  • సీఆర్ పాటిల్.. జల శక్తి

  • మన్ సుఖ్ మాండవీయ..క్రీడలు, యువజన,కార్మిక ఉపాధి

  • గజేంద్ర సింగ్ షెకావత్ .. సాంస్కృతిక,పర్యాటక శాఖ

  • కిరణ్ రిజిజు.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ

  • కుమార స్వామి.. భారీ పరిశ్రమలు,ఉక్కు శాఖ

  • కిషన్ రెడ్డి.. బొగ్గు గనుల శాఖ

  • రామ్మోహన్ నాయుడు.. పౌర విమానయాన శాఖ

Updated Date - Jun 10 , 2024 | 09:10 PM