Home » Modi 3.0 Cabinet
కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ యువనేత కింజరాపు రామ్మోహన్‌నాయుడు (37) టీడీపీ సీనియర్ నేతల్లో అగ్రగణ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడి కుమారుడు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయ న.. అతిచిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చారు.
మొదటిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి.. గుంటూరు ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు తొలి దఫాలోనే కేంద్ర మంత్రి పదవి దక్కింది. 1976 మార్చి 7న తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో జన్మించిన ఆయ న.. డాక్టర్‌గా అమెరికాలో స్థిరపడి, వైద్యరంగంలో ఉన్నత స్థాయికి ఎదిగారు.
రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకార మహోత్సవం జూన్ 9న ఘనంగా జరిగింది. 2014లో మోదీ తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టినప్పటి తర్వాత కేబినెట్‌లో ఒకే ఒక్క మహిళా మంత్రి ఉండేవారు.
దేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీని ప్రమాణం చేయించారు. అయితే ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న సమయంలో మోదీ చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు.
ప్రధాని మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకర కార్యక్రమం ఢిల్లీలోని రాష్ర్టపతి భవన్‌లో ఘనంగా జరుతోంది. మోదీ మంత్రి వర్గంలో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు భాగం కానున్నారు.
దేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీని ప్రమాణం చేయించారు. ప్రత్యేక సందర్భాల్లో విభిన్న వేశధారణకు ఆసక్తి చూపే మోదీ.. ఇవాళ జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి విభిన్నంగా రెడీ అయ్యారు.
ఢిల్లీలో ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉల్లాసంగా జరిగింది. ఈ సారి మంత్రి వర్గంలో అందరి చూపు ఒకరిపై ఉంది. ఆయన మరెవరో కాదు ఏపీ నుంచి టీడీపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కింజారపు రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu Kinjarapu).
లోక్ సభ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించిన ఎన్డీఏ కూటమి.. కేంద్ర పగ్గాలు మరోసారి చేపట్టింది. మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ వరుసగా మూడోసారి మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు ఆయన కేబినెట్‌లో ఉండే ఎంపీలపై క్లారిటీ వచ్చింది. మొత్తం 57 మంది మంత్రులు ఇవాళ ప్రమాణం చేయనున్నారు.
కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో అనేక రాష్ట్రాల్లో ఎంపీలకు మంత్రి పదవులు వరించాయి. తెలంగాణలో కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రి పదవులు వరించాయని ప్రచారం సాగుతోంది.