Modi 3.0: ఇంతకీ లోక్‌సభ స్పీకర్ ఎవరు?
ABN , Publish Date - Jun 10 , 2024 | 01:57 PM
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీతోపాటు కేబినెట్ మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేయడంతో.. మూచ్చటగా మూడో సారి ఆయన ప్రభుత్వం కేంద్రంలో కోలువు తీరింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీతోపాటు కేబినెట్ మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేయడంతో.. మూచ్చటగా మూడో సారి ఆయన ప్రభుత్వం కేంద్రంలో కోలువు తీరింది. అయితే లోక్‌సభ స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందనే ఓ చర్చ అయితే ప్రస్తుతం పోలిటికల్ సర్కిల్‌లో వాడి వేడిగా వైరల్ అవుతుంది. గత ఎన్నికల్లో అంటే.. 2014,2019 ఎన్నికల్లో బీజేపీ 272 లోక్‌సభ స్థానాలకు పైగా విజయం సాధించింది.
దీంతో స్పీకర్‌గా బీజేపీ ఎంపీలు సుమిత్ర మహాజన్, ఓం బిర్లా ఎంపికయ్యారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 స్థానాలనే గెలుచుకుంది. దీంతో మోదీ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీయే భాగస్యామ్య పక్షాలు టీడీపీ, జేడీ(యూ), జేడీ(ఎస్), శివసేన (శిండే వర్గం), లోక్‌జనశక్తి (రామ్ విలాస్ పాశ్వాన్) కీలక పాత్ర పోషించాయి. దీంతో ఆ యా పార్టీల ఎంపీలు కేబినెట్‌లో మంత్రి పదవులు సైతం దక్కించుకున్నాయి.
దీంతో లోక్‌సభ స్పీకర్ పదవి బీజేపీ తీసుకుంటుందా?.. లేకుంటే భాగస్యామ్య పక్షాలు తీసుకుంటాయా? అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఒకటి రెండు రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో సభలోని సీనియర్లలో ఒకరిని ప్రొటెం స్పీకర్‌గా రాష్ట్రపతి ఎంపిక చేస్తారు. వారే.. లోక్‌సభ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. అయితే ఈ సారి టీడీపీ, జేడీయూలకు చెందిన ఎంపీల్లో ఒకరికి ఆవకాశం వచ్చే ఛాన్స్ ఉందనే ఓ ప్రచారం సైతం కొనసాగుతుంది.
ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్.. మోదీ ప్రభుత్వం మరికొన్ని నెలల్లో కూలిపోతుందని ఆరోపించారు. ఈ ఘటన ఆరు నుంచి ఏడాది లోపు జరుగుతుందని ఆయన ప్రయాగ్ రాజ్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌గా మీరు ఎంపీల్లో ఒకరిని ఎంపిక చేసుకోవాలంటూ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీయూల అధినేతలకు ఆయన హితవు పలికారు. అది కూడా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మరి అలాంటి పరిస్థితుల్లో లోక్‌సభ స్పీకర్ ఎవరవుతారనే ఓ చర్చ సైతం ఊపందుకుంది. ఇక లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ వారే ఉంటారంటూ ఆ పార్టీ అగ్రనేతలు ఇప్పటికే భాగస్వామ్య పక్షాలకు స్పష్టం చేశారనే ఓ ప్రచారం కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందని అంశంపై సర్వత్ర దృష్టి సారించారు.
Read More National News and Latest Telugu News