PM Modi: మోదీ కేబినెట్‌లో ఒకే ఒక్క మహిళ.. వరుసగా మూడోసారి
ABN , Publish Date - Jun 09 , 2024 | 10:20 PM
రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకార మహోత్సవం జూన్ 9న ఘనంగా జరిగింది. 2014లో మోదీ తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టినప్పటి తర్వాత కేబినెట్‌లో ఒకే ఒక్క మహిళా మంత్రి ఉండేవారు.
ఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకార మహోత్సవం జూన్ 9న ఘనంగా జరిగింది. 2014లో మోదీ తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టినప్పటి తర్వాత కేబినెట్‌లో ఒకే ఒక్క మహిళా మంత్రి ఉండేవారు. ఆమె మరెవరో కాదు.. నిర్మలా సీతారామన్. 2014లో మోదీ కేబినెట్‌లో నిర్మలా పరిశ్రమ, వాణిజ్య మంత్రిగా పని చేశారు. 2017లో ఆమెకు రక్షణ శాఖను అప్పగించారు.
2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యానికి గురైనప్పుడు సీతారామన్ పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి మహిళగా నిలిచారు. అంతకుముందు, ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్వల్ప కాలానికి ఆర్థిక మంత్రిగా పని చేశారు. తాజాగా మోదీ కేబినెట్‌లోకి మూడోసారి మంత్రిగా చేరి మంత్రి వర్గంలో ఉన్న ఒకే ఒక్క మహిళగా రికార్డు నెలకొల్పారు.