Share News

PM Modi: మోదీ దుస్తుల వెనక సీక్రెట్ తెలుసా!

ABN , Publish Date - Jun 09 , 2024 | 08:52 PM

దేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీని ప్రమాణం చేయించారు. ప్రత్యేక సందర్భాల్లో విభిన్న వేశధారణకు ఆసక్తి చూపే మోదీ.. ఇవాళ జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి విభిన్నంగా రెడీ అయ్యారు.

PM Modi: మోదీ దుస్తుల వెనక సీక్రెట్ తెలుసా!

ఢిల్లీ: దేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీని ప్రమాణం చేయించారు. ప్రత్యేక సందర్భాల్లో విభిన్న వేశధారణకు ఆసక్తి చూపే మోదీ.. ఇవాళ జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి విభిన్నంగా రెడీ అయ్యారు.

నీలం రంగు జాకెట్‌తో కూడిన తెల్లటి కుర్తా, చురీదార్‌ని వేసుకున్నారు. వాటితోపాటు నల్లటి బూట్లను వేసుకున్నారు.


గతంలో..

2014లో తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు.. మోదీ లేత గోధుమరంగు బంగారు జాకెట్‌తో కూడిన క్రీమ్ లినెన్ కుర్తా-పైజామా ధరించారు. 2019 ప్రమాణ స్వీకారోత్సవం చేసేప్పుడు లేత గోధుమరంగు జాకెట్‌తో కూడిన దుస్తులను వేసుకున్నారు.

ముఖ్యమైన సందర్భాల్లో కుర్తాలు, బంద్‌గాలా జాకెట్లు ధరించడం మోదీకి ఇష్టం. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో మోదీ రంగురంగుల తలపాగాలను ధరిస్తారు. ఈ ఏడాది జనవరిలో రిపబ్లిక్ డే కోసం బహుళ వర్ణ బంధాని ప్రింట్ సఫాను మోదీ ధరించారు. అలా ఎప్పటికప్పుడు సందర్భానుసారంగా ఆయన తన వినూత్నతను చాటుకుంటారు.

Updated Date - Jun 09 , 2024 | 08:52 PM