Home » Modi Cabinet
దేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీని ప్రమాణం చేయించారు. అయితే ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న సమయంలో మోదీ చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు.
దేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీని ప్రమాణం చేయించారు. ప్రత్యేక సందర్భాల్లో విభిన్న వేశధారణకు ఆసక్తి చూపే మోదీ.. ఇవాళ జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి విభిన్నంగా రెడీ అయ్యారు.
ఢిల్లీలో ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉల్లాసంగా జరిగింది. ఈ సారి మంత్రి వర్గంలో అందరి చూపు ఒకరిపై ఉంది. ఆయన మరెవరో కాదు ఏపీ నుంచి టీడీపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కింజారపు రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu Kinjarapu).
లోక్ సభ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించిన ఎన్డీఏ కూటమి.. కేంద్ర పగ్గాలు మరోసారి చేపట్టింది. మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ వరుసగా మూడోసారి మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు ఆయన కేబినెట్లో ఉండే ఎంపీలపై క్లారిటీ వచ్చింది. మొత్తం 57 మంది మంత్రులు ఇవాళ ప్రమాణం చేయనున్నారు.
మోదీ3.0 కేబినేట్లో తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలకు కేంద్రమంత్రి పదవులు వరించాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి (Kishan Reddy), కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లను (Bandi Sanjay) కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకున్నారు.
మరికొద్ది సేపట్లో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ సర్కారు కొలువుతీరబోతోంది. దేశ ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 50 మంది వరకు కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయవచ్చంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఈసారి మోదీ కేబినెట్లో పలువురు మాజీ కేంద్ర మంత్రులు, ఆశావహులకు చోటుదక్కలేదని తెలుస్తోంది.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి164 సీట్లతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏపీ నుంచి బీజేపీ తరఫున నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు (Bhupathiraju Srinivasa Varma) మోదీ3.0 కేబినేట్లో అవకాశం వరించింది. ఈ మేరకు పీఎంవో నుంచి ఆయనకు సమాచారం వచ్చింది.
అదృష్టం ఉంటే చాలు.. దేనికోసం మనం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు.. అదే మన అడ్రస్ వెతుక్కుంటూ వస్తుందనే సామెత ఆయనకు సరిగ్గా సరిపోతుంది. ఎంపీ టికెట్ కోసం పైరవీలు చేయలేదు.. పార్టీ కోసం కష్టపడి పనిచేయడమే ఆయనకు తెలుసు.. టికెట్ కావాలంటూ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టలేదు.. అధిష్టానం పెద్దలను అడగలేదు.
వరుసగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ రాత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాత్రి 7:15 గంటలకు మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా.. ఆయనతో పాటు 57 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.