Modi Cabinet: కేంద్రమంత్రులకు మోదీ చేసిన సూచనలు తెలిస్తే.. మైండ్‌బ్లాంక్..!
ABN , Publish Date - Jun 10 , 2024 | 11:59 AM
రేంద్రమోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకు ఎంతో మంది దేశానికి ప్రధానులుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎవరికి వారే ప్రత్యేకత. 2014 నుంచి మోదీ ప్రధానిగా ఉన్నారు. ఆయన వ్యవహరశైలి విషయంలో మెచ్చుకునేవారు ఉన్నారు.. విమర్శించే వారున్నారు.
నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకు ఎంతో మంది దేశానికి ప్రధానులుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎవరికి వారే ప్రత్యేకత. 2014 నుంచి మోదీ ప్రధానిగా ఉన్నారు. ఆయన వ్యవహరశైలి విషయంలో మెచ్చుకునేవారు ఉన్నారు.. విమర్శించే వారున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మోదీ మాత్రం తాను అనుకున్నదే చేయడం అలవాటుగా చేసుకున్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు తన కేబినెట్‌లో కలిసి పనిచేసే మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దాదాపు ఓ గంట పాటు అనేక విషయాలను మోదీ కేంద్రమంత్రులుకు చెప్పారు. మోదీ కేబినెట్‌లో ఆయనకంటే పార్టీలో సీనియర్ నేతలు, గతంలో సీఎంలుగా చేసినవాళ్లున్నారు. కొందరు కొత్త మంత్రులు కూడా ఉన్నారు. కేంద్రమంత్రులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏం చేయాలనేదానికంటే.. ఎలా వ్యవహరించాలనేదానిపై ప్రధాని ఎంపీలకు పలు సూచనలు చేశారట. ఈ విషయాన్ని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బయటపెట్టారు. ప్రధాని మోదీ ఎలాంటి సూచనలు చేశారో వివరించారు.
Cabinet Meeting: ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ మీటింగ్
మోదీ ఏం చెప్పారంటే..
కేంద్రమంత్రి బాధ్యతల్లో ఉన్నప్పుడు దేశమంతా మనవైపే చూస్తుందని.. ఆ సందర్భంగా హుందాగా ప్రవర్తించడంతో పాటు.. బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పారట. ఎక్కువ సమయంలో సంబంధిత కార్యాలయంలో విధులు నిర్వహించాలని, పెండింగ్ ప్రాజెక్టులపై నిరంతరం సమీక్షిస్తూ పనులు వేగంగా జరిగేలా పర్యవేక్షించాలని మోదీ సూచించారట. విమానాశ్రయాల్లో అనవసరంగా వివాదాల్లో చిక్కుకోవద్దని.. అవసరమైతే క్యూలైన్‌లో వెళ్లాలని.. ఏదైనా సమావేశాలు లేదా కార్యక్రమాలకు సమయానికి హాజరయ్యేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారట. వీలైనంతవరకు ఆలస్యంగా వెళ్లకుండా చూసుకోవాలని.. ప్రతిరోజు మంత్రిత్వశాఖ కార్యాలయానికి వెళ్లాలని చెప్పారట. వారంలో నాలుగు నుంచి ఐదు రోజులు ఢిల్లీలోని మంత్రిత్వ శాఖ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని.. కార్యాలయంలో సిబ్బంది పనితీరును గమనిస్తూ ఉండాలని మోదీ కేంద్రమంత్రులకు చెప్పినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.
ప్రతిపక్షాలకు ప్రయారిటీ..
ప్రతిపక్ష ఎంపీలకు తగిన గౌరవం ఇవ్వాలని, వారినుంచి ఎలాంటి లేఖలు వచ్చినా వెంటనే స్పందించాలని.. అలాగే లేఖకు సమాధానం ఇవ్వాలని మోదీ కేంద్రమంత్రులకు చెప్పారట. ప్రజలకు సంబంధించి ప్రతిపక్ష ఎంపీలు లేవనెత్తే సమస్యలపై సంబంధిత శాఖ మంత్రులు వెంటనే స్పందించి.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మోదీ చెప్పారని కిషన్‌రెడ్డి తెలిపారు.
కార్యాలయంపై దృష్టి..
మంత్రిత్వశాఖ కార్యాలయంలో పనిచేసే సిబ్బందితో స్నేహపూర్వకంగా ఉండటంతో పాటు.. అటెండర్ మొదలు ఉన్నతస్థాయి అధికారి వరకు అందరినీ ఆప్యాయంగా పలకరించడంతో పాటు వారి పనితీరు మరింత మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాలని మోదీ సూచించారు. అవసరమైతే మంత్రిత్వశాఖ కార్యాలయంలో ముఖ్యమైన అధికారులకు మంత్రులు తమ ఇంట్లో అన్‌అఫిషియల్‌గా భోజనం పెట్టి.. వారితో పనికి సంబంధించిన అంశాలను చర్చించడంతో పాటు అధికారులతో స్నేహపూర్వక సంబంధాలను మెరుగుపర్చుకోవాలని మోదీ కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
VK Pandyan: రాజకీయాలకు పాండ్యన్ బైబై
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News