Home » Mudragada Padmanabham
సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తాను, తన కుమారుడు వైసీపీలో చేరామని కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. నేడు కిర్లంపూడిలో ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ... శుక్రవారం పిల్లల పరీక్షల దృష్ట్యా ర్యాలీ నిర్వహించినప్పుడు ధ్వనులు ఇబ్బంది కలిగిస్తుందని నిర్ణయం మార్చుకున్నానని ముద్రగడ అన్నారు.
ఎట్టకేలకు పవన్ కల్యాణ్ పోటీపై క్లారిటీ వచ్చేసింది. జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తాను పిఠాపురం(Pithapuram) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ స్వయంగా ప్రకటించేశారు. దీంతో పిఠాపురంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఇప్పటి వరకు టీడీపీ-జనసేన కూటమి తరఫున జనసేన టికెట్‌ను తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, పిల్లా శ్రీధర్ ఆశించారు. టీడీపీ నుంచి వర్మ పోటీ చేయాలని భావించారు. అయితే, పవన్ పోటీ చేస్తానని ప్రకటించడంతో..
కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు మరో అవమానం జరిగింది. ఈనెల 14న (గురువారం) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడానికి ఆయన నిర్ణయించుకున్నారు. ఆరోజు 10 వేల కార్లు..జనాలు తనవెంట రావాలని ఇటీవల ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 14న వైసీపీలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేరనున్నారు. వైసీపీ లో చేరుతున్నట్లు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. జగన్‌ను సీఎం పీఠంపై కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా వైసీపీ కోసం పనిచేయాలని నిర్ణయించు కున్నట్లు వెల్లడించారు.
Andhrapradesh: ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్లినంత మాత్రాన కాపులు వెళ్ళరని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతో ఉన్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు - పవన్‌లు నిలబడ్డారని అన్నారు.
Pawan Kalyan: ఎన్నికల సమీపిస్తున్న వేళ పార్టీల మధ్య పొత్తులు, నేతల జంపింగ్‌లతో ఏపీ రాజకీయం (AP Politics) ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఇదే సమయంలో పార్టీలకు చెందిన నేతలే కాకుండా కుల సంఘాలకు చెందిన నేతలు సైతం ఆయా పార్టీల అధినేతలపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంచలన కామెంట్స్ చేశారు.
నేడు ముద్రగడ ఇంటికి వైసీపీ కీలక నేతలు వెళ్లనున్నారు. వైసీపీలో చేరాలని పార్టీ జిల్లా పరిశీలకుడు మిథున్ రెడ్డి, మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు ఆహ్వానించనున్నారు. పార్టీ మాటగా రాజ్యసభ ఇచ్చేందుకు నేతలు హామీ ఇవ్వనున్నారు. ఎన్నికల్లో ముద్రగడను రాష్ట్రంలో పలుచోట్ల ప్రచారం చేయంచాలని వైసీపీ ఆలోచిస్తోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan)పై వ్యక్తిగతంగా బురద జల్లే ప్రయత్నం చేస్తే తాము కూడా కాపు సంఘం నేతలు హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభంపై వ్యక్తిగతంగా మాట్లాడతామని జనసేన పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు గోవిందరావు(Govinda Rao) హెచ్చరించారు.
పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తారన్న ప్రచారంతో వైసీపీలో గుబులు ప్రారంభమైంది. అక్కడ అభ్యర్ధిని మళ్లీ మూడోసారి మార్చేందుకు వైసీపీ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓటమి భయంతో సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుకు టికెట్ నిరాకరించడం జరిగింది. ఆ స్థానంలో కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురానికి జగన్ బదిలీ చేశారు.
Andhrapradesh: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తానని కబురు పంపారని.. అయోధ్య వెళ్ళొచ్చిన తరువాత కిర్లంపూడి వస్తానని మరోకసారి కబురు పంపించారన్నారు. ఎటువంటి కోరికలు లేకుండా కలుస్తానని ఇప్పటికే చెప్పానని అన్నారు.