Pawan Kalyan: పిఠాపురంలో పవన్‌పై వైసీపీ నుంచి పోటీ చేసేదెవరు..?
ABN , Publish Date - Mar 14 , 2024 | 04:19 PM
ఎట్టకేలకు పవన్ కల్యాణ్ పోటీపై క్లారిటీ వచ్చేసింది. జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తాను పిఠాపురం(Pithapuram) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ స్వయంగా ప్రకటించేశారు. దీంతో పిఠాపురంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఇప్పటి వరకు టీడీపీ-జనసేన కూటమి తరఫున జనసేన టికెట్‌ను తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, పిల్లా శ్రీధర్ ఆశించారు. టీడీపీ నుంచి వర్మ పోటీ చేయాలని భావించారు. అయితే, పవన్ పోటీ చేస్తానని ప్రకటించడంతో..
అమరావతి: ఎట్టకేలకు పవన్ కల్యాణ్ పోటీపై క్లారిటీ వచ్చేసింది. జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తాను పిఠాపురం(Pithapuram) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ స్వయంగా ప్రకటించేశారు. దీంతో పిఠాపురంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఇప్పటి వరకు టీడీపీ-జనసేన కూటమి తరఫున జనసేన టికెట్‌ను తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, పిల్లా శ్రీధర్ ఆశించారు. టీడీపీ నుంచి వర్మ పోటీ చేయాలని భావించారు. అయితే, పవన్ పోటీ చేస్తానని ప్రకటించడంతో వారు సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి పవన్‌కు అపోనెంట్‌గా పోటీ చేసేది ఎవరా? అనే అంశంపై పడింది. వాస్తవానికి రానున్న ఎన్నికల్లో ద్విముఖ పోరే ఉండనుంది. ఇటు అధికార వైసీపీ.. అటు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థికి మధ్య పోటీ జరుగనుంది. ఈ నేపథ్యంలో పవన్‌ను ఎదుర్కొనే వైసీపీ అభ్యర్థి ఎవరు అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.
పవన్‌ను ఢీకొట్టనున్న వంగా గీత..!
ఇటీవలే వైసీపీ అధిష్టానం ప్రకటించిన రెండో జాబితాలో పిఠాపురం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా వంగా గీతను నియమించారు. పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా దాదాపు వంగా గీతనే కన్ఫామ్ అయ్యారు. ఈ ప్రకారం.. పిఠాపురం ఎమ్మెల్యే బరిలో పవన్ కల్యాణ్‌ను వంగా గీత ఢీకొట్టనున్నారు. పవన్ అభ్యర్థిత్వం ఖరారవడంతో.. ఈసారి పవన్‌ను ఓడించి తీరాలని వంగా గీత ప్లాన్స్ చేస్తున్నారట.
ముద్రగడ ఫ్యామిలీకి టికెట్..!
ఇదిలాఉంటే.. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని వార్తలు రావడంతో వైసీపీ అధిష్టానం కూడా అలర్ట్ అయ్యింది. సీఎం జగన్ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే వంగా గీతను సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిచి మాట్లాడారు వైఎస్ జగన్. ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరితే.. ఆయన కుటుంబం నుంచి ఒకరిని పిఠాపురం నుంచి బరిలోకి దింపాలన్న ఆలోచనలు కూడా చేస్తున్నట్లు సమాచారం. వంగా గీతకు పిఠాపురం ఎమ్మెల్యే స్థానం బదులుగా కాకినాడ పార్లమెంట్ పరిధిలోని మరో అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించాలని భావిస్తున్నారట. మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. పవన్‌ను ఢీకొట్టేది ముద్రగడ ఫ్యామిలీనా..? లేక వంగా గీతానా? అనేది తేలాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..