AP Election 2024: పిఠాపురంలో పవన్ పోటీపై ముద్రగడ కూతురు సంచలన వ్యాఖ్యలు.. జగన్‌కు ఊహించని షాక్
ABN , Publish Date - May 03 , 2024 | 11:16 AM
కాపు నేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంపై ఆయన కూతురు ముద్రగడ క్రాంతిభారతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పిఠాపురలంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత కోసం ముద్రగడ ప్రచారం చేస్తున్నారు. ఆ క్రమంలో ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో గెలిచి, పవన్ కల్యాణ్‌ను తన్ని తరిమేస్తానని అహంకారంతో మాట్లాడారు. పిఠాపురంలో వంగ గీత గెలవకుంటే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరారు. ఆ వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం కూతురు ముద్రగడ క్రాంతి భారతి స్పందించారు.
కాపు నేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంపై (Mudragada Padmanabham) ఆయన కూతురు ముద్రగడ క్రాంతిభారతి (Mudragada Kranthi Bharathi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పిఠాపురలంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత (Vanga Geetha) కోసం ముద్రగడ ప్రచారం చేస్తున్నారు. ఆ క్రమంలో ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో గెలిచి, పవన్ కల్యాణ్‌ను తన్ని తరిమేస్తానని అహంకారంతో మాట్లాడారు. పిఠాపురంలో వంగ గీత గెలవకుంటే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరారు. ఆ వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం కూతురు ముద్రగడ క్రాంతి భారతి స్పందించారు. సోషల్ మీడియా ఎక్స్‌లో వీడియోను ట్వీట్ చేశారు.
క్రాంతి ఏమన్నారంటే..?
వీడియోలో క్రాంతి భారతి తనను తాను పరిచయం చేసుకున్నారు. తన తండ్రి ముద్రగడ తీరు గురించి మండిపడ్డారు. ‘పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత విజయం కోసం తన తండ్రి పనిచేయొచ్చు, కష్ట పడొచ్చు తప్పు లేదు. జగన్ మెప్పు కోసం పవన్ కల్యాణ్ మీద మాట్లాడుతున్న భాష మాత్రం సరికాదు. పవన్ కల్యాణ్, ఆయన అభిమానులను కించపరిచేలా మాట్లాడటం తగదు. ముద్రగడ తీరు మార్చుకోవాలి. పవన్ కల్యాణ్‌ను తిట్టడం వల్ల ఒరిగేదేమి లేదు. ఎన్నికల సమయంలో ముద్రగడను సీఎం జగన్ వాడుతున్నారు. ఆ తర్వాత ముద్రగడ ఎటు కాకుండా పోవడం ఖాయం. ఈ విషయం ముద్రగడ తెలుసుకుంటే మంచిది. పవన్ కల్యాణ్ గెలుపు కోసం తన వంతుగా కృషి చేస్తా అని’ క్రాంతి భారతి ప్రకటించారు.
తండ్రి వైసీపీ- కూతురు కూటమి
ముద్రగడ పద్మనాభం కాపుల రిజర్వేషన్ల కోసం పోరాడారు. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో నిలువలేదు. పిఠాపురం అభ్యర్థి వంగా గీత కోసం ప్రచారం చేస్తున్నారు. అక్కడ కూటమి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో కాపుల ఓటు బ్యాంకు ఎక్కువ.. అందుకే పవన్ పోటీ చేస్తున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం, పవన్ కల్యాణ్ ఇద్దరు కాపులే అనే సంగతి తెలిసిందే. కాపు నేతతో పవన్‌ను తిట్టించడం వల్ల తమకు ప్లస్ అవుతోందని సీఎం జగన్ భావిస్తున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. తండ్రి ముద్రగడ వైసీపీకి మద్దతుగా బరిలోకి దిగారు. తండ్రి వ్యాఖ్యలను కూతురు క్రాంతి భారతి ఖండించారు. అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతు ప్రకటించారు. ఇది కూటమికి కలిసొచ్చే అంశవని నేతలు అభిప్రాయ పడుతున్నారు.
Read Latest AP News And Telugu News