Mudragada Padmanabham: ఆయన సినిమా హీరో అయితే.. నేను పొలిటికల్ హీరో
ABN , Publish Date - Mar 16 , 2024 | 11:58 AM
సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తాను, తన కుమారుడు వైసీపీలో చేరామని కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. నేడు కిర్లంపూడిలో ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ... శుక్రవారం పిల్లల పరీక్షల దృష్ట్యా ర్యాలీ నిర్వహించినప్పుడు ధ్వనులు ఇబ్బంది కలిగిస్తుందని నిర్ణయం మార్చుకున్నానని ముద్రగడ అన్నారు.
కాకినాడ : సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) సమక్షంలో తాను, తన కుమారుడు వైసీపీ (YSRCP)లో చేరామని కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) తెలిపారు. నేడు కిర్లంపూడి (Kirlampudi)లో ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ... జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పై పరోక్ష విమర్శలు చేశారు. శుక్రవారం పిల్లల పరీక్షల దృష్ట్యా ర్యాలీ నిర్వహించినప్పుడు ధ్వనులు ఇబ్బంది కలిగిస్తుందని నిర్ణయం మార్చుకున్నానని ముద్రగడ అన్నారు. ఎటువంటి పదవులు ఆశించకుండా.. వైసీపీకి సేవ చేసేందుకు నిర్ణయించుకున్నానన్నారు. తనకు రాజకీయ భవిష్యత్తుని ఇచ్చింది బీసీ, దళిత వర్గాలని ముద్రగడ పేర్కొన్నారు. తాను రాజకీయాలలోకి రావడానికి కాపులు కారణం కాదని.. తన సొంత నిర్ణయం ప్రకారమే తాను పార్టీలో చేరానన్నారు.
CM Revanth: సీఎంగా తొలిసారి ఏపీకి రేవంత్... కామెంట్లపై సర్వత్రా ఆసక్తి
‘‘నా రాజకీయ భవిష్యత్ తన ఇష్టం. సోషల్ మీడియా (Social Media)లో చాలా మంది ఇష్టానుసారం పోస్ట్‌లు పెడుతున్నారు. వారు సినిమాలో హీరో కావచ్చు.. నేను రాజకీయాలలో హీరో. నన్ను ఇనుప ముక్కలా నీటిలో వదిలేసి ఇదిగో వస్తా, అదిగో వస్తా అని తప్పించుకుని తిరిగారు. నాకు రాజకీయ భిక్ష పెట్టింది ప్రత్తిపాడు నియోజకవర్గం అని గొప్పగా చెప్పుకుంటా. మాకు మనోభావాలు ఉంటాయి, తప్పుడు పోస్టింగ్లు పెట్టకండి. జగన్ (Jagan)ను 30 సంవత్సరాల పాటు ప్రజలు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారు. సినిమా వాళ్ళలో ఎన్టీఆర్ (NTR)ని మాత్రమే ప్రజలు నమ్మారు... ఇంక ఏపీ ప్రజలు సినిమా హీరోలను రాజకీయాలలో నమ్మరు’’ అని ముద్రగడ పేర్కొన్నారు.
Kesineni Nani: టిక్కెట్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూళ్లు చేసిన చరిత్ర కేశినేని నానిది..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..