Home » Mukesh Ambani
రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల్లోని అతిరథ మహారథులు తరలివస్తున్నారు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ వేడుకలు జరిగే గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చేరుకున్నారు.
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. శుక్రవారం సాయంత్ర 5:30 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకలు మార్చి 3 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొనేందుకు బాలీవుడ్ స్టార్స్‌తో పాటు, పలువురు ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా వచ్చారు. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో లీకై హల్చల్ చేస్తున్నాయి.
మార్చి ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జరగబోతున్నాయి. దాదాపు వెయ్యి మంది వ్యాపార ప్రముఖులు ఈ వేడుకల కోసం భారత్ రానున్నారు.
ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. రాధికా మర్చంట్‌ను అనంత్ పెళ్లాడబోతున్నాడు. ఈ నేపథ్యంలో చిన్న కోడలికి అంబానీ ఇచ్చిన ఖరీదైన బహుమతుల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్వహించిన అనంత్ అంబానీ (Anant Ambani), రాధిక మర్చంట్ల (Radhika Merchant) ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌కు మైక్రోసాఫ్ట్ (Microsoft) సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates), అతని మాజీ భార్య మెలిండా గేట్స్ (Melinda Gates) హాజరుకానున్నారు. ఆ ఇద్దరితో పాటు మెటా సీఈవో మార్క్ జుకర్గ్బర్గ్ (Mark Zuckerberg), ఇవాంకా ట్రంప్‌లతో (Ivanka Trump) కలుపుకొని మొత్తం 1,000 మంది అతిథులను ఈ వేడుకలకు ఆహ్వానించారని తెలిసింది.
భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఆయిల్ నుంచి టెలికం వరకు బహుళ వ్యాపారాలు నిర్వహిస్తున్న ఈ దేశీయ వ్యాపార దిగ్గజం మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం రూ.20 లక్షల కోట్ల మార్క్‌ను తాకింది.
అయోధ్య బాలరాముడుకి ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ కుటుంబం భారీ విరాళం ప్రకటించింది. రూ.2.50 కోట్ల నగదును రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందజేస్తామని వెల్లడించింది.
దేశమంతటా రామ నామ స్మరణ మార్మోగుతున్న వేళ ప్రముఖ వ్యాపారవేత్త, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ఇంటిని చూడ చక్కగా అలంకరించారు. ముంబయిలోని అంబానీ అధికారిక నివాసం యాంటిలియా ఆకర్షణీయమైన లైటింగ్‌తో చూపరులను కట్టిపడేస్తోంది.
రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆహ్వానం అందిన ప్రముఖులంతా అయోధ్యకు చేరుకున్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ శ్రీరాముడి జన్మభూమి ఆలయం అయోధ్యకు చేరుకున్నారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సచిన్ హాజరయ్యారు.