Reliance: అరుదైన మైలురాయిని చేరుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. మొట్టమొదటి ఇండియన్ కంపెనీగా అవతరణ
ABN , Publish Date - Feb 13 , 2024 | 05:30 PM
భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఆయిల్ నుంచి టెలికం వరకు బహుళ వ్యాపారాలు నిర్వహిస్తున్న ఈ దేశీయ వ్యాపార దిగ్గజం మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం రూ.20 లక్షల కోట్ల మార్క్‌ను తాకింది.
న్యూఢిల్లీ: భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఆయిల్ నుంచి టెలికం వరకు బహుళ వ్యాపారాలు నిర్వహిస్తున్న ఈ దేశీయ వ్యాపార దిగ్గజం మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం రూ.20 లక్షల కోట్ల మార్క్‌ను తాకింది. దీంతో రూ.20 లక్షల కోట్లకుపైగా ఎం-క్యాప్ కలిగివున్న తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ నిలిచింది. క్రితం సెషన్‌లో రూ.19.93 లక్షల కోట్లుగా ఉన్న కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్.. మంగళవారం నాడు రిల్ ( Reliance Industries Ltd) షేర్ విలువ 2 శాతం మేర వృద్ధి చెందడంతో కీలకమైన మైలురాయిని చేరుకుంది. ఈ రికార్డును అందుకున్న మొట్టమొదటి భారతీయ లిస్టెడ్ కంపెనీగా అవతరించింది.
కాగా బీఎస్‌ఈపై రిల్ షేర్లు మంగళవారం 1.88 శాతం లాభపడి రూ.2,957.80 వద్ద ముగిశాయి. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవలే తన ఆర్థిక సేవల విభాగం ‘జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్’ను(JFS) ప్రత్యేకంగా విడదీసి స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ చేసింది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,70,331.55 కోట్లుగా ఉంది. m-క్యాప్‌ను కలిగి ఉంది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ విలువ పెరగడంతో ఆ కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ సంపదను 109 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఒక్క 2024లోనే ఆయన సంపద విలువ 12.5 బిలియన్ డాలర్ల మేర పెరగడం విశేషం. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం ముకేశ్ అంబానీ ప్రస్తుతం అత్యంత సంపన్న భారతీయుడిగా, ప్రపంచంలో 11వ ధనవంతుడిగా ఉన్నారు.