Share News

Ram Mandir: అయోధ్య రాముడికి అంబానీ భారీ విరాళం.. ఎంతంటే..!!

ABN , Publish Date - Jan 23 , 2024 | 10:47 AM

అయోధ్య బాలరాముడుకి ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ కుటుంబం భారీ విరాళం ప్రకటించింది. రూ.2.50 కోట్ల నగదును రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందజేస్తామని వెల్లడించింది.

 Ram Mandir: అయోధ్య రాముడికి అంబానీ భారీ విరాళం.. ఎంతంటే..!!

అయోధ్య: అయోధ్యలో బాలరాముడు (Ram Lalla) కొలువయ్యాడు. మంగళవారం (ఈ రోజు) నుంచి ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సోమవారం నాడు కన్నుల పండువగా జరిగింది. ఆ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. రామ మందిరానికి ముఖేశ్ అంబానీ భారీ విరాళం ప్రకటించారు. రూ.2.50 కోట్ల నగదును రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందజేస్తానని వెల్లడించారు. అయోధ్య ఆలయానికి బాల రాముడి రాకతో యావత్ దేశమంతా దీపావళి పండగను జరుపుకుంటుందని ముకేశ్ అంబానీ అభిప్రాయ పడ్డారు. జనవరి 22వ తేదీ చారిత్రాత్మక మైన రోజుగా నిలుస్తోందని ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ తెలిపారు.

రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖేశ్ అంబానీ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. అతని భార్య నీతా అంబానీ, కుమారులు ఆకాశ్, అనంత్, కోడలు శ్లోకా మెహతా, కాబోయే కోడలు రాధికా మర్చంట్, కూతురు ఇషా, అల్లుడు ఆనంద్ పిరమిళ్ వచ్చారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని దేశంలోని 506 మంది ప్రముఖులను ట్రస్ట్ ఆహ్వానించింది. వీరిలో రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, సినీ నటులు, క్రీడాకారులు, అధికారులు, జడ్జిలు ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 23 , 2024 | 11:17 AM