Home » Mulugu
ములుగు: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా కలెక్టరేట్లో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవంతో పాటు.. దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే వాహనాలు, చక్రాల కుర్చీల పంపిణీ చేయనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలు.. శంకుస్థాపనలతో పాటు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
మావోయిస్టుల ఏరివేత పేరుతో అడవుల్లో బలగాల మోహరింపు.. దానికి కౌంటర్‌గా పోలీసులే లక్ష్యంగా బూబీట్రాప్స్, మందుపాతరలతో నక్సల్స్ ప్రతివ్యూహాలతో ఛత్తీ్‌సగఢ్-తెలంగాణ సరిహద్దు ఏజెన్సీల పౌరులు గజగజ వణికిపోతున్నారు. ఇటీవల వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు ఏసు అనే స్థానికుడు బలవ్వడంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు విలవిల్లాడుతున్నారు.
వాజేడు మండలం కొంగాల అటవీప్రాంతంలో జూన్ 4న మందుపాతర పేలిన (Landmine Explosion) ఘటనపై మావోయిస్టులు (Maoists) స్పందించారు. మందుపాతర పేలి ఏసు అనే వ్యక్తి మృతిచెందడం బాధాకరమన్నారు. తమ జాడకోసం పోలీసులే ఏసును అటవీప్రాంతంలోకి పంపి ప్రాణాలు తీశారని ఆరోపించారు.
తమ జాడ కనుగొనేందుకు ఇల్లెందుల ఏసు అనే వ్యక్తిని పోలీసులే అడవిలోకి పంపగా మందుపాతర తొక్కి అతడు మరణించాడని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. ఏసు మరణానికి పోలీసులే బాఽధ్యులని, బాధిత కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంటూ
ములుగు జిల్లా: వాజేడు మండలంలో మందు పాతర పేలి వ్యక్తి మృతి చెందాడు. పోలీసులే లక్ష్యంగా అమర్చిన మందు పాత్ర పేలి వ్యక్తి మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో చోటుచేసుకుంది.
స్థల వివాదం కారణం.. ఏకంగా సమ్మక్క సారలమ్మ ఆలయం(Medaram Temple) మూసివేసే పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదం నేపథ్యంలోనే సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని(Sammakka Saralamma Temple) రెండు రోజులు మూసివేస్తున్నట్లు మేడారం ఆలయ పూజారులు ప్రకటించారు. మే 29, 30వ తేదీల్లో సమ్మక్క - సారలమ్మ ఆలయాలను..
ములుగు జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోరుమీదున్న కాంగ్రెస్, సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని గట్టిగా కృషిచేస్తోంది. ఈ క్రమంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సీతక్క ములుగు జిల్లా, వెంకటాపురం మండలం, నల్లగుంటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ములుగు జిల్లాలో మావోయిస్ట్ లేఖ కలకలం సృష్టించింది. తెలంగాణ - ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను మావోయిస్ట్ పార్టీ ఖండించింది. పూజార్ - కాంకేర్ ఎన్కౌంటర్ మృతులకు మావోయిస్ట్ పార్టీ జోహార్లు అర్పించింది.
Telangana: తెలంగాణ కుంభమేళాగా పిలవడే మేడారం సమక్క-సారలమ్మ మహా జాతర అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు మేడారంకు విచ్చేసి గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకుని... మొక్కలు చెల్లించుకున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరిగింది. అయితే జాతర ముగిసిన తర్వాత మాత్రం అక్కడి పరిసరాలను చూస్తే ముక్కులు మూసుకోకమానరు.
వరంగల్: మేడారం హుండీల లెక్కింపు ప్రక్రియ గురువారం హనుమకొండ టీటీడీ కళ్యాణమండపంలో ప్రారంభం కానుంది. మొత్తం 512 హుండీల ఆదాయాన్ని లెక్కించనున్నారు. ఈ లెక్కింపు ప్రక్రియ పది రోజుల పాటు కొనసాగనుంది.