Share News

Chelpaka Encounter: అన్నంలో విషం పెట్టి చంపారు

ABN , Publish Date - Dec 23 , 2024 | 09:42 AM

Telangana: చెల్పాక ఎన్‌కౌంటర్ ప్రాంతాన్ని పౌరహక్కుల సంఘం నేతలు పరిశీంచారు. చెల్పాక ఎన్‌కౌంటర్ అంతా బూటకమే అని, అన్నంలో విషం పెట్టి చంపారని పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపించారు.

Chelpaka Encounter: అన్నంలో విషం పెట్టి చంపారు
Chelpaka Encounter

ములుగు, డిసెంబర్ 23: చల్పాకలో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్ అని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపించారు. సోమవారం చెల్పాకలో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పౌరహక్కుల సంఘం నేతలు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. అన్నంలో విషం పెట్టి మావోయిస్టులను చంపారని వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల ముందు మావోలను పట్టుకు వచ్చి చిత్రహింసలు పెట్టి చంపారన్నారు.

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. కీలక మలుపు తిరిగిన కేసు..


ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో చెట్లకు తూటాలు తగిలిన ఆధారాలు లేవన్నారు. మన తెలంగాణ.. ఎన్‌కౌంటర్ల తెలంగాణగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో16 మందిని ఎన్కౌంటర్ పేరుతో హత్య చేసిందని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలతో హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ ఎన్‌కౌంటర్ హత్యాకాండను కొనసాగిస్తోందన్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోయిస్టుల వెపన్స్ లాక్ చేసి ఉన్నాయని తెలిపారు. చెల్పాక ఎన్‌కౌంటర్ ప్రాంతానికి వెళ్లే సమయంలో పోలీసులు తమను మఫ్టీలో వెంబడించారన్నారు. నాలుగు నెలల్లో మూడు ఎన్‌కౌంటర్లలో 14 మందిని చంపి ప్రజా పాలనని చెప్పుకుంటుంది అంటూ మండిపడ్డారు. ప్రజాపాలనంటే పోలీసులతో చేసేది పాలన కాదన్నారు. రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని చెప్పాలంటే గ్రేహౌండ్స్ బలగాలను వెనక్కు తీసుకోవాలని పౌరహక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు.

భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. ఇవే టాప్ 5 స్టాక్స్


కాగా.. డిసెంబర్ 2న ఏటూరు నాగారం మండలం చెల్పాక-ఐలాపూర్‌ అభయారణ్యంలోని పోలకమ్మవాగు సమీపంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు మృత్యువాతపడ్డారు. పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఛత్తీ్‌సగఢ్‌-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం అభయారణ్యాన్ని గ్రేహౌండ్స్‌, స్పెషల్‌పార్టీ పోలీసులు జల్లెడ పడుతున్న క్రమంలో ఏలూరు నాగారం అడవుల్లో మావోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ఇరువురి మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల అనంతరం ఏడుగురు మావోల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలిలో రెండు ఏకే-47 తుపాకులు, జీత్రీ, 303-రైఫిల్‌, ఇన్సాస్‌ తుపాకీ, ఎస్‌బీబీఎల్‌ గన్‌, సింగిల్‌షాట్‌ తుపాకీ, తపంచా, కిట్‌బ్యాగులు, విప్లవ సాహిత్యం, వంట సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. . మృతుల్లో ఓ మహిళ సహా.. నర్సంపేట-ఇల్లందు ఏరియా కమిటీ కార్యదర్శి కుర్సం మంగు అలియాస్‌ భద్రు, ఏటూరునాగారం-మహాదేవ్‌పూర్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఈగోలపు మల్లయ్య అలియాస్‌ మధు ఉన్నారు. పీఎల్‌జీఏ వారోత్సవాలకు ఒకరోజు ముందే భారీ కాల్పులు జరగడం మావోయిస్టులకు కోలుకోలేని పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు.


ఇవి కూడా చదవండి...

నోటీసులకు స్పందించిన పేర్ని నాని కుటుంబం..

గుడ్ న్యూస్.. జియో న్యూ ప్లాన్.. వివరాలు ఇవే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 23 , 2024 | 10:05 AM