Home » Mumbai Indians
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ చెలరేగాడు. ఆరంభం నుంచి ధాటిగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ 6 ఫోర్లు, 3 సిక్సులతో 27 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. అయితే హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌కు ఇప్పటివరకు ఏది కలిసిరాలేదు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి అతని స్థానంలో హార్దిక్ పాండ్యాను తీసుకురావడం బెడిసికొచ్చింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఆశించిన మేర సత్తా చాటలేకపోతున్నాడు. దీనికి తోడు జట్టు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ద్వేషిస్తున్నంతగా మరెవరిని ద్వేషించకపోవచ్చు. సోషల్ మీడియాలో, బయట హార్దిక్ పాండ్యాపై అనేక మంది క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్తిస్తున్నారు. హార్దిక్ పాండ్యాను హేళన చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచ్‌లు ఆడిన ఒకే ఒక జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు 250వది.
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నిప్పులు చెరిగాడు. తన పేస్ పదునుతో ఏకంగా ముగ్గురు ముంబై బ్యాటర్లను గోల్డెన్ డకౌట్ చేశాడు. అది కూడా 4 బంతుల వ్యవధిలోనే కావడం గమనార్హం.
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కాయిన్ వేయగా రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ హెడ్స్ చెప్పాడు. కాయిన్ కూడా హెడ్స్ పడింది. టాస్ గెలిచిన శాంసన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ఇంతవరకూ బోణీ కొట్టలేదు. ఆడిన మొదటి రెండు మ్యాచుల్లోనూ పరాజయాలను చవిచూసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గెలుపు అంచుల దాకా వెళ్లి ఓడిపోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో దారుణ ఓటమిని మూటగట్టుకుంది.
అభిషేక్ ఎంతో అద్భుతమైన ఆటతీరు కనబరిచాడని, అతని మెరుపు ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అందరూ కొనియాడుతున్నారు. కానీ.. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మాత్రం అభిషేక్‌ని బూతులు తిట్టాడు. నిన్ను కొట్టేందుకు నా దగ్గర చెప్పు సిద్ధంగా ఉందంటూ కుండబద్దలు కొట్టాడు.
క్రికెట్లో ఏదైనా ఒక జట్టు ఓటమి పాలైనప్పుడు.. దాని పరిణామాలపై ఆయా జట్టు కోచ్‌లు కెప్టెన్‌తో చర్చలు జరపడాన్ని మనం తరచూ చూస్తూ ఉంటాం. కానీ.. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి పాలయ్యాక అందుకు భిన్నమైన దృశ్యం కనిపించింది. ముంబై జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో ఆ జట్టు యజమాని ఆకాశ్ అంబాని కాసేపు చర్చించుకున్నారు.