IPL 2024: రోహిత్ మనసు బంగారం.. హార్దిక్ కోసం ఏం చేశాడో చూడండి..
ABN , Publish Date - Apr 02 , 2024 | 04:29 PM
ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ద్వేషిస్తున్నంతగా మరెవరిని ద్వేషించకపోవచ్చు. సోషల్ మీడియాలో, బయట హార్దిక్ పాండ్యాపై అనేక మంది క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్తిస్తున్నారు. హార్దిక్ పాండ్యాను హేళన చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ముంబై: ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను(Hardik Pandya) ద్వేషిస్తున్నంతగా మరెవరిని ద్వేషించకపోవచ్చు. సోషల్ మీడియాలో, బయట హార్దిక్ పాండ్యాపై అనేక మంది క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్తిస్తున్నారు. హార్దిక్ పాండ్యాను హేళన చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ 2024(IPL 2024) ప్రారంభానికి ముందు రోహిత్ శర్మను(Rohit sharma) ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఆ భాధ్యతలను గుజరాత్ టైటాన్స్ నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యాకు అప్పగించారు. ఐపీఎల్‌లో అత్యంత విజయంతమైన కెప్టెన్, ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా కూడా ఉన్న రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబై మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ నుంచి హార్దిక్ పాండ్యాను అభిమానులు టార్గెట్ చేశారు.
రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన మరు క్షణం నుంచే చాలా మంది అభిమానులు సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ ఖాతాలను ఆన్ ఫాలో చేశారు. దీంతో గతంలో సోషల్ మీడియాలో నంబర్ వన్‌గా ముంబై ఇండియన్స్ ప్రస్తుతం ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ జెర్సీలను, జెండాలను కాల్చేశారు. ఒక రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్ అభిమానులే కాకుండా సాధారణ క్రికెట్ అభిమానులు కూడా రోహిత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఐపీఎల్ 2024 మొదలయ్యాక ఇది మరింత పెరిగిపోయింది. తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ విషయమై హార్దిక్ పాండ్యా ప్రవర్తించిన తీరు అభిమానులకు మరింత కోపాన్ని తెప్పించింది.
ఆ ఘటన తర్వాత రోహిత్ శర్మకు ఇతర క్రికెటర్లు, జట్ల అభిమానులు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. హార్దిక్ పాండ్యా మైదానంలో కనిపించగానే రోహిత్ శర్మ.. రోహిత్ శర్మ అని అరుస్తున్నారు. హార్దిక్ పాండ్యా టాస్ సమయంలో, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ సమయంలో స్టేడియంలోని అభిమానులు అతడిని హేళన చేస్తున్నారు. మొదటి మ్యాచ్‌లో అయితే స్టేడియంలోని ప్రేక్షకులు హార్దిక్‌ను కుక్కతో పోల్చారు. ఇప్పటివరకు అహ్మదాబాద్, హైదరాబాద్, వాంఖడేలో జరిగిన మ్యాచ్‌ల్లో హార్దిక్ పాండ్యాను ప్రేక్షకులు అన్ని విధాల టార్గెట్ చేశారు. దీనికి తోడు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌లు ఓడిపోవడం కూడా అతనికి మైనస్‌గా మారింది.
దీంతో అభిమానుల అల్లరి మరింత ఎక్కువైంది. చాలా మంది హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం వాంఖడేలో రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై ఇండియన్స్ ఆడిన మ్యాచ్‌లోనూ హార్దిక్ పాండ్యాను అభిమానులు హేళన చేశారు. రోహిత్.. రోహిత్.. నినాదాలతో అభిమానులు హోరెత్తారు. అయితే ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ తన మంచి మనసును చాటుకున్నాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న హిట్‌మ్యాన్ అలా అనొద్దంటూ మైదానంలోని అభిమానులకు సైగ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా రోహిత్‌పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రకారం రోహిత్ శర్మ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. దీంతో అభిమానులు రోహిత్.. రోహిత్.. అని నినాదాలు చేస్తూ.. హార్దిక్ పాండ్యాను హేళన చేశారు. దీంతో అలా చేయొద్దంటూ వారికి రోహిత్ శర్మ సైగలు చేశాడు. దీంతో అభిమానులు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. హార్దిక్ పాండ్యాను హేళన చేయడం ఆపేశారు. దీంతో పలువురు నెటిజన్లు రోహిత్ మనసు బంగారం అంటూ కొనియాడుతున్నారు. హార్దిక్ పాండ్యా, ముంబై ఇండియన్స్ తనకు అంత అన్యాయం చేసినప్పటికీ జట్టులో ఆటగాడిగా తన పూర్తి బాధ్యతలను నెరవేరుస్తున్నాడని అంటున్నారు. అంతేకాకుండా హార్దిక్ పాండ్యాను హేళన చేయొద్దని సూచించడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IPL 2024: ఐపీఎల్‌లో ఆ రోజు జరగాల్సిన బిగ్ మ్యాచ్‌పై నీలి నీడలు.. ఎందుకంటే..
Sachin: నా చిన్ననాటి కల 13 ఏళ్ల క్రితం నెరవేరింది.. సచిన్ ట్వీట్