MI vs RR: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఆ ఘనత సాధించిన ఒకే ఒక జట్టుగా..
ABN , Publish Date - Apr 01 , 2024 | 09:09 PM
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచ్‌లు ఆడిన ఒకే ఒక జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు 250వది.
ముంబై: ఐపీఎల్‌లో(IPL 2024) అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్(Mumbai Indians) చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచ్‌లు ఆడిన ఒకే ఒక జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు 250వది. దీంతో ముంబై సరికొత్త చరిత్ర సృష్టించింది. 16 ఏళ్ల ఐపీఎల్ ప్రస్థానంలో ముంబై ఇండియన్స్ ఎన్నో మరుపురాని విజయాలు సాధించింది. ఈ క్రమంలో చాలా మంది స్టార్ క్రికెటర్లను కూడా తయారుచేసింది. సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ వంటి అనేక మంది క్రికెటర్లు ముంబై ఫ్రాంచైజీ ద్వారా స్టార్ క్రికెటర్లుగా మారిపోయారు. అనామక క్రికెటర్లుగా ముంబై జట్టులోకి అడుగుపెట్టి స్టార్లుగా ఎదిగిన వారి సంఖ్య చాలానే ఉంది.
అలాగే రోహిత్ శర్మ వంటి అద్భుత కెప్టెన్‌ను కూడా ముంబై ఇండియన్సే తయారుచేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ అత్యధికంగా 5 సార్లు ట్రోఫీ కూడా గెలిచింది. అంతేకాకుండా రెండు సార్లు ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లు కూడా గెలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ తిరుగులేని జట్టుగా అవతరించింది. గెలిచిన 5 టైటిళ్లు అతని కెప్టెన్సీలోనే వచ్చాయి. రెండు ఫైనల్స్‌లో ముంబై ఇండియన్స్ ఒకే ఒక పరుగు తేడాతో గెలిచిందంటే దానికి రోహిత్ శర్మ కెప్టెన్సీనే కారణం అని చెప్పుకోవాలి.
IPL 2024: ముంబైతో మ్యాచ్‌లో చరిత్ర సృష్టించనున్న అశ్విన్.. ఆ రికార్డు సాధించిన తొలి బౌలర్‌గా..
IPL 2024: ఐపీఎల్‌లో ఆ రోజు జరగాల్సిన బిగ్ మ్యాచ్‌పై నీలి నీడలు.. ఎందుకంటే..