MI vs DC: రోహిత్ శర్మ ఖాతాలో రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే..
ABN , Publish Date - Apr 07 , 2024 | 04:41 PM
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ చెలరేగాడు. ఆరంభం నుంచి ధాటిగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ 6 ఫోర్లు, 3 సిక్సులతో 27 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. అయితే హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians vs Delhi Capitals) బ్యాటర్ రోహిత్ శర్మ(Rohit Sharma) చెలరేగాడు. ఆరంభం నుంచి ధాటిగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ 6 ఫోర్లు, 3 సిక్సులతో 27 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. అయితే హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో చేసిన రన్స్ ద్వారా ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రోహిత్ శర్మ 1,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ 1,000 పరుగులు చేసిన రెండో ప్రత్యర్థి ఢిల్లీ క్యాపిటల్స్ కావడం గమనార్హం. గతంలో కోల్‌కతానైట్ రైడర్స్‌పై కూడా రోహిత్ 1,000 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్(IPL) చరిత్రలో రెండు వేర్వేరు జట్లపై 1,000 పరుగుల చొప్పున చేసిన మూడో బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు.
రోహిత్ శర్మ కంటే ముందు డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించారు. డేవిడ్ వార్నర్ పంజాబ్ కింగ్స్‌పై, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 1,000 పరుగుల చొప్పున చేయగా.. విరాట్ కోహ్లీ ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నైసూపర్ కింగ్స్‌పై 1,000 పరుగుల చొప్పున చేశాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 14 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ పాండ్యా(26), టిమ్ డేవిడ్ (2) ఉన్నారు. అంతకుముందు రోహిత్ శర్మ(49), ఇషాన్ కిషన్(42) రాణించారు. అయితే తిలక్ వర్మ(6), సూర్యకుమార్ యాదవ్ (0) నిరాశపరిచారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
SRH vs CSK: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. సీఎస్కే ఓడిపోయిందని ఏకంగా..
SRH vs CSK: ధోని క్రీజులోకి రాకుండా కమిన్స్ వ్యూహం పన్నాడా..? అందుకే రివ్యూకు వెళ్లలేదా..?