Home » Mumbai
కోన్ ఐస్‌క్రీమ్‌లో వేలు వచ్చిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ముంబైకి చెందిన డాక్టర్ ఆన్ లైన్లో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయగా, అందులో ఒకదానిలో వేలు కనిపించింది. ఆ వేలు ఎవరిదనే అంశంపై దాదాపు క్లారిటీ వచ్చింది. పుణే ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో పనిచేసే ఓ ఉద్యోగి వేలు అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇండిగో విమానానికి మంగళవారం రాత్రి 10.24 గంటలకు బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. 6E 5149 విమానాన్ని ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 196 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. విమానం ల్యాండ్ చేసిన తర్వాత సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిట ఫోర్స్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విమానం తనిఖీ చేసేందుకు ప్రయాణికులు చక్కని సహకారం అందజేశారని ఇండిగో ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి తర్వాత ఒక ప్రకటనలో తెలిపారు.
దేశవ్యాప్తంగా మళ్లీ బాంబు బెదిరింపులు(Bomb threat) కలకలం రేపుతున్నాయి. గతంలో పాఠశాలలు, వివిధ సంస్థలు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రాగా, తాజాగా ఆస్పత్రులకు వచ్చాయి. బీఎంసీ ప్రధాన కార్యాలయం సహా ముంబై(Mumbai)లోని 50కిపైగా ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
మెదక్‌లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో పోలీసులు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన మెదక్ వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైకి విజయవాడ నుంచి డైలీ ఫ్లైట్ ప్రారంభమైంది. విజయవాడ(గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శనివారం రాత్రి 7.15 గంటలకు 180 సీట్ల సామర్థ్యం కలిగిన ఎయిర్ఇండియా ఎయిర్‌బస్ విమానం బయలుదేరింది.
మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష 'మహా వికాస్ అఘాడి' విజయం ఆరంభం మాత్రమేనని, ముగింపు కాదని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విపక్ష కూటమి కలిసే పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఏక్నాథ్ షిండే శిబిరంలోని నేతలను తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష 'మహా వికాస్ అఘాడి'కి మద్దతు తెలిపిన ప్రజలందరికీ కూటమి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఎంవీఏ నేతలు శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, పృధ్వీరాజ్ కపూర్ సంయుక్తంగా శనివారంనాడు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కడైతే రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించారో అక్కడ తాము గెలిచామని ఈ సందర్భంగా శరద్ పవార్ అన్నారు.
పుణె కారు ప్రమాదం కేసులో దిగ్ర్భాంతికర విషయాలు ఇంకా వెలుగులోకి వస్తున్నాయి. మే 19న పుణెకు చెందిన 17 ఏళ్ల కుర్రాడు మద్యం మత్తులో అతి నిర్లక్ష్యంగా కారును నడిపి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కుర్రాడి రక్త నమూనాల స్థానంలో అతడి తల్లి రక్త నమూనాలను ఉంచి కేసును తప్పుదోవ పట్టించేందుకు చూశాడు ససూన్ ఆస్పత్రి ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ అజయ్ తవాడే.
భోజనం చేశాక తీరిగ్గా కూర్చుని చల్లటి ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదిస్తున్న ఆయన నాలుకకు ఏదో గట్టిగా తగిలింది! అది పళ్ల కింద నలగలేదు.. అంటే డ్రైఫ్రూట్ కాదు. అనుమానమొచ్చి చేత్తో బయటకు తీసి చూసి కంగుతిన్నాడు! అది.. మనిషి చేతి వేలు! ముంబైలోని పశ్చిమ మలాద్ ప్రాంతంలోని ఓర్లెమ్ బెండన్ సెర్రావో అనే 26 ఏళ్ల వైద్యుడికి ఇలా ఒళ్లు గగుర్పొడిచే జుగుప్సాకరమైన, భయానక అనుభవం ఎదురైంది.
తింటున్న ఐస్‌క్రీమ్‌లో చేతి వేలు ఉండడాన్ని గమనించి డాక్టర్ నిర్ఘాంత పోయారు. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తులో భాగంగా ఐస్‌క్రీమ్‌లోని చేతి వేలును పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.