Share News

Indigo Flight: ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు..?

ABN , Publish Date - Jun 19 , 2024 | 10:10 AM

ఇండిగో విమానానికి మంగళవారం రాత్రి 10.24 గంటలకు బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. 6E 5149 విమానాన్ని ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 196 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. విమానం ల్యాండ్ చేసిన తర్వాత సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిట ఫోర్స్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విమానం తనిఖీ చేసేందుకు ప్రయాణికులు చక్కని సహకారం అందజేశారని ఇండిగో ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి తర్వాత ఒక ప్రకటనలో తెలిపారు.

Indigo Flight: ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు..?
Indigo Flight

ఏబీఎన్ ఇంటర్నెట్: ఇండిగో విమానానికి మంగళవారం రాత్రి 10.24 గంటలకు బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. 6E 5149 విమానాన్ని ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 196 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. విమానం ల్యాండ్ చేసిన తర్వాత సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిట ఫోర్స్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విమానం తనిఖీ చేసేందుకు ప్రయాణికులు చక్కని సహకారం అందజేశారని ఇండిగో ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి తర్వాత ఒక ప్రకటనలో తెలిపారు. తనిఖీలు చేసి బాంబ్ ఏమీ లేదని ధృవీకరించారు. తర్వాత విమానాన్ని టెర్మినల్ ప్రాంతానికి తరలించారు. మంగళవారం (నిన్న) ఒకరోజు 41 ఎయిర్ పోర్టులకు బాంబ్ ఉందని బెదిరింపు మెయిల్ వచ్చింది. అన్నిచోట్ల తనిఖీలు చేపట్టారు. అన్ని బెదిరింపు కాల్స్ అని అధికారులు తేల్చారు. ఇలాంటి బెదిరింపుల తమ సేవలకు అంతరాయం కలిగించలేవని ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. విమానాలు, ఆస్పత్రుల్లో కూడా బాంబ్ పెట్టామని బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. అవి బెదిరింపు కాల్స్ అని అధికారులు నిర్ధారించారు.

Updated Date - Jun 19 , 2024 | 10:10 AM