Bomb Threat: 50కిపైగా ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు.. హెడ్ క్వార్టర్ పేల్చివేస్తామని..
ABN , Publish Date - Jun 19 , 2024 | 07:06 AM
దేశవ్యాప్తంగా మళ్లీ బాంబు బెదిరింపులు(Bomb threat) కలకలం రేపుతున్నాయి. గతంలో పాఠశాలలు, వివిధ సంస్థలు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రాగా, తాజాగా ఆస్పత్రులకు వచ్చాయి. బీఎంసీ ప్రధాన కార్యాలయం సహా ముంబై(Mumbai)లోని 50కిపైగా ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
దేశవ్యాప్తంగా మళ్లీ బాంబు బెదిరింపులు(Bomb threat) కలకలం రేపుతున్నాయి. గతంలో పాఠశాలలు, వివిధ సంస్థలు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రాగా, తాజాగా ఆస్పత్రులకు వచ్చాయి. బీఎంసీ ప్రధాన కార్యాలయం సహా ముంబై(Mumbai)లోని 50కిపైగా ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం రాత్రి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఈమెయిల్ ఐడీకి బెదిరింపు మెయిల్స్ పంపారు. ఆసుపత్రి బెడ్‌కింద, బాత్‌రూమ్‌లో బాంబులు పెట్టారని మెయిల్‌లో పేర్కొన్నారు. ఇమెయిల్‌లు అన్నీ ఒకే ID నుంచి వచ్చాయి. బెదిరింపు ఇ-మెయిల్‌ను స్వీకరించిన తరువాత BMC అధికారులు సహా ఆయా ఆస్పత్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు(police) BMC ప్రధాన కార్యాలయంతో(BMC headquarters) సహా ఆసుపత్రులలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కానీ అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని, వీపీఎన్ నెట్‌వర్క్ ద్వారా బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చినట్లు ముంబై పోలీసులు ధృవీకరించారు. అయితే మెయిల్ పంపించిన వ్యక్తిని ఇంకా పోలీసులు గుర్తించలేదు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు.
ముంబైలోని జస్లోక్ హాస్పిటల్, రహేజా హాస్పిటల్, సెవెన్ హిల్ హాస్పిటల్, కోహినూర్ హాస్పిటల్, కేఈఎమ్ హాస్పిటల్, జేజే హాస్పిటల్, సెయింట్ జార్జ్ హాస్పిటల్ సహా 50కి పైగా ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఆసుపత్రులే కాకుండా ముంబైలోని హిందూజా కాలేజ్ ఆఫ్ కామర్స్‌పై కూడా బాంబు దాడి చేస్తామని బెదిరించారు. దీనికి ముందు దేశంలోని 41 విమానాశ్రయాలకు(airports) బాంబు బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయి. దీని తర్వాత కొన్ని గంటలపాటు భద్రతా సంస్థలు విమానాశ్రయాల్లో సోదాలు నిర్వహించి, దర్యాప్తు చేయగా అవి నకిలీవని తేలింది. వీటిలో చెన్నై, పాట్నా, జైపూర్‌తో సహా 41 విమానాశ్రయాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి:
Supreme Court : తప్పు జరిగితే ఒప్పుకోండి
Rahul Gandhi : 24 లక్షల మంది భవిష్యత్తు గందరగోళం
Read Latest National News and Telugu News