Finger In Ice Cream: ఆ వేలు ఎవరిదంటే..? పోలీసుల క్లారిటీ..!!
ABN , Publish Date - Jun 19 , 2024 | 01:37 PM
కోన్ ఐస్‌క్రీమ్‌లో వేలు వచ్చిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ముంబైకి చెందిన డాక్టర్ ఆన్ లైన్‌లో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయగా, అందులో ఒకదానిలో వేలు కనిపించింది. ఆ వేలు ఎవరిదనే అంశంపై దాదాపు క్లారిటీ వచ్చింది. పుణే ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో పనిచేసే ఓ ఉద్యోగి వేలు అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఏబీఎన్ ఇంటర్నెట్: కోన్ ఐస్‌క్రీమ్‌లో వేలు వచ్చిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ముంబైకి చెందిన డాక్టర్ ఆన్ లైన్‌లో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయగా, అందులో ఒకదానిలో వేలు కనిపించింది. ఆ వేలు ఎవరిదనే అంశంపై దాదాపు క్లారిటీ వచ్చింది. పుణే ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో పనిచేసే ఓ ఉద్యోగి వేలు అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ వ్యక్తి వేలికి ఇటీవల గాయం అయ్యింది. ఐస్ క్రీమ్‌లో కనిపించిన వేలు ఇతనిదేనని పోలీసులు సందేహిస్తున్నారు. ధృవీకరించేందుకు ఉద్యోగి డీఎన్ఏ శాంపిల్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరికి పంపించారు. ఆ నివేదికను బట్టి ఆ వేలు ఎవరిదనే అంశంపై స్పష్టత రానుంది.
ఏం జరిగిందంటే..?
మలాద్‌కు చెందిన డాక్టర్ బ్రెండన్ ఫెర్రారో ఇటీవల మూడు కోన్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశారు. ఐస్ క్రీమ్ తినే సమయంలో పెద్దగా (వేలు) తాకడంతో నట్ అనుకున్నారు. ఆ వెంటనే వేలు, గోరు కనిపించడంతో పరిశీలించి చూశారు. మనిషి వేలు అని నిర్ధారించుకొని షాకయ్యారు. వెంటనే ఘటనకు సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఐస్ క్రీమ్ కంపెనీ యమ్మో స్పందించింది. థర్డ్ పార్టీ వద్ద ఉత్పత్తి జరిగిందని, ప్రొడక్షన్ నిలిపివేశామని ప్రకటన చేసింది.
తనిఖీలు.. లైసెన్స్ రద్దు..?
కోన్ ఐస్ క్రీమ్‌లో వేలు వచ్చిందని తెలియడంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీలో తనిఖీలు చేపట్టింది. కంపెనీ లైసెన్స్‌ను సస్పెండ్ చేసింది. ఆ కేసు విచారిస్తోండగా పుణె ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తి చేతికి గాయమైందని పోలీసుల దృష్టికి వచ్చింది. అతని డీఎన్ఏ శాంపిల్స్ తీసుకున్నారు. ఆ వేలితో మ్యాచ్ చేసి చూస్తున్నారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ వేలు అతనిదేనా..? లేదా అనే విషయం తెలియనుంది.