Home » MVV Satyanarayana
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం సమావేశమైంది. ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆడిటర్ జీవీ, పలువురు ముఖ్య నేతలు జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కిడ్నాప్, తదనంతరం పరిణామాలపై సీఎంతో చర్చిస్తున్నారు
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ వ్యవహారంలో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఎంపీ ఎంవీవీ... తన మిత్రుడు ఆడిటర్ జీవీ ఫోన్ ఎత్తకపోవడంతో ఏదో జరిగిందని అనుమానించి పోలీస్ కమిషనర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
ఏపీలో జరిగిన రెండే రెండు ఘటనలు.. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ హాట్ టాపిక్ అవుతున్నాయి.. ఈ రెండింటిపై పోలీసులు చెప్పిన కహానీలు వింటే బాబోయ్ వీళ్ల కన్నా దొంగలే నయం బాబోయ్ అనేంతలా ఆశ్చర్యపోతారేమో..! ఎందుకింతలా ఏపీ పోలీసుల (AP Police) గురించి చెప్పాల్సి వస్తోందంటే ఆ మధ్య టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డిపై (Anam Venkata Ramana Reddy) జరిగిన దాడికి యత్నం.. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ (MP MVV Family Kidnap) వ్యవహారంపై పోలీసులు చెబుతున్న కారణాలు ఏ మాత్రం నమ్మశక్యంగా లేవు...
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ ఘటనపై డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వింత సమాధానమిచ్చారు. ఎవరైనా సమాచారం ఇస్తేనే తాము స్పందించగలమని మీడియా ప్రతినిధులకే ఎదురు పశ్న వేశారు. ఎంపీ సమాచారం ఇచ్చిన వెంటనే ట్రేస్ చేశామని తెలిపారు. విశాఖ పోలీసులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారంటూ డీజీపీ కితాబిచ్చారు. ఎంపీకి సెక్యూరిటీ ఉంటుంది కానీ, ఎంపీ కుమారుడికి ఎందుకుంటుందన్నారు. కిడ్నాప్ వ్యవహరం ఎంపీ చెబితేనే తమకు తెలిసిందని ఆయన చెప్పారు.
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మంచి వ్యక్తి అని ఎంపీ రఘురామకృష్ణరాజు కొనియాడారు. విశాఖ ఎంపీ భార్యను, కుమారుడిని కిడ్నాప్ చేశారని, కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎంపీకి ఫోన్ చేస్తారు కానీ.. జీవీకి ఎందుకు ఫోన్ చేశారు? అని ప్రశ్నించారు. కడప గ్యాంగ్, కర్నూల్ గ్యాంగ్ కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. హేమంత్కుమార్ అనే వ్యక్తికి కిడ్నాప్కి సంబంధం లేదని తోచిపుచ్చారు.
‘‘నా కొడుక్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. తర్వాత నా కుటుంబసభ్యులకు ఫోన్ చేశాను. వారి నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. ఫోన్లు లిప్ట్ చేయకపోవడంతో నాకు అనుమానం వచ్చింది. తర్వాత కుటుంబసభ్యులు కిడ్నాప్ అయ్యారని తెలిసింది. వారిని 48 గంటల పాటు కిడ్నాపర్లు బంధించారు. నా కొడుకుని కిడ్నాప్ చేసింది రౌడీ షీటర్ హేమంత్. గతంలో హేమంత్ ఓ కిడ్నాప్ కేసులో ముద్దాయి. కేవలం డబ్బు కోసమే నా కొడుకుని నా భార్యను కిడ్నాప్ చేశారు. రెండు గంటల్లోనే కిడ్నాప్‌ను విశాఖ పోలీసులు చేదించారు’’ అని ఎంవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు.
గ్రేటర్ విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ సభ్యుల కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. సినీ ఫక్కీలో చేజ్ చేసి కిడ్నాపర్లను
విశాఖలో వైసీపీ ఎంపీ భార్యాపిల్లల కిడ్నాప్ కలకలం రేపింది. ప్రముఖ ఆడిటర్, మాజీ స్మార్ట్ సిటి చైర్మన్ జీవీతో పాటు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు చందు, భార్య జ్యోతి కిడ్నాప్ అయ్యారు. ఈ విషయం క్షణాల్లో మీడియాలో వైరల్ అయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు క్షణాల్లో ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ ఆచూకీని కనుగొన్నారు. కిడ్నాపైన ముగ్గురూ క్షేమంగా ఉన్నారని ఎంపీ తెలిపారు. విశాఖ-ఏలూరు రోడ్డులో ఎంపీ భార్య, కుమారుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు.