MP MVV Satyanarayana: డబ్బు కోసమే కిడ్నాప్ చేశారు: ఎంవీవీ
ABN , First Publish Date - 2023-06-15T17:48:42+05:30 IST
‘‘నా కొడుక్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. తర్వాత నా కుటుంబసభ్యులకు ఫోన్ చేశాను. వారి నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. ఫోన్లు లిప్ట్ చేయకపోవడంతో నాకు అనుమానం వచ్చింది. తర్వాత కుటుంబసభ్యులు కిడ్నాప్ అయ్యారని తెలిసింది. వారిని 48 గంటల పాటు కిడ్నాపర్లు బంధించారు. నా కొడుకుని కిడ్నాప్ చేసింది రౌడీ షీటర్ హేమంత్. గతంలో హేమంత్ ఓ కిడ్నాప్ కేసులో ముద్దాయి. కేవలం డబ్బు కోసమే నా కొడుకుని నా భార్యను కిడ్నాప్ చేశారు. రెండు గంటల్లోనే కిడ్నాప్‌ను విశాఖ పోలీసులు చేదించారు’’ అని ఎంవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు.
విశాఖ: గ్రేటర్ విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (YCP MP MVV Satyanarayana) ఫ్యామిలీ సభ్యుల కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. సినీ ఫక్కీలో చేజ్ చేసి కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాప్ కథ సుఖాంతం కావడంతో ఎంవీవీ సత్యనారాయణ కుటుంబసభ్యులు, ఇటు పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఎంపీ సత్యనారాయణ రెండు రోజుల నుంచీ హైదరాబాద్ (Hyderabad)లోనే ఉంటున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన కొద్దిసేపటి క్రితం విశాఖ చేరుకున్నారు.
డబ్బు కోసమే కిడ్నాప్ చేశారు
‘‘నా కొడుక్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. తర్వాత నా కుటుంబసభ్యులకు ఫోన్ చేశాను. వారి నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. ఫోన్లు లిప్ట్ చేయకపోవడంతో నాకు అనుమానం వచ్చింది. తర్వాత కుటుంబసభ్యులు కిడ్నాప్ అయ్యారని తెలిసింది. వారిని 48 గంటల పాటు కిడ్నాపర్లు బంధించారు. నా కొడుకుని కిడ్నాప్ చేసింది రౌడీ షీటర్ హేమంత్. గతంలో హేమంత్ ఓ కిడ్నాప్ కేసులో ముద్దాయి. కేవలం డబ్బు కోసమే నా కొడుకుని నా భార్యను కిడ్నాప్ చేశారు. రెండు గంటల్లోనే కిడ్నాప్‌ను విశాఖ పోలీసులు చేదించారు’’ అని ఎంవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు.
నిందితులను విచారిస్తున్న పోలీసులు
ఎంవీవీ సత్యనారాయణ, భార్య కుమారుడు ఆడిటర్‌ను కిడ్నాప్ చేసిన నిందితులను ఆనందపురం పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న సీసీ రోడ్డు బ్లాక్ చేశారు. స్టేషన్ దరిదాపుల్లోకి ఎవ్వరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మీడియాను కూడా పోలీసులు అనుమతివ్వలేదు. హేమంత్ ఈ కిడ్నాప్ ద్వారా రూ.50 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ వీజారెడ్డిని హత్య చేసిన కేసులో హేమంత్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. హేమంత్ తరచూ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో గొడవలు పడుతూ ఉంటాడని పోలీసులు వెల్లడించారు. ఈ సంవత్సరం కూడా అతనిపై ఇలాంటి కేసులు ఉన్నాయన్నారు.