Home » Nalgonda News
మద్యం మత్తులో 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి ఒడిగట్టాడో దుర్మార్గుడు. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో ఈ ఘటన జరిగింది. ఎస్సై సతీశ్ వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో ఓ వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది.
మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కొన్ని కుటుంబాల్లో భర్త సరిగా ఉంటే భార్య సరిగా ఉండదు. మరికొన్ని కుటుంబాల్లో భార్య సరిగా ఉంటే భర్త సరిగా ఉండరు. దీంతో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలతో హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఒకరిపై మరొకరికి నమ్మకం లేకుండా పోయి పిల్లల జీవితాలు నరకప్రాయం చేస్తున్నారు.
రాష్ట్రంలోని బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
అమాయకుల ఆధార్ కార్డులను సేకరించి వాటిలో చిరునామా మార్చడంతోపాటు వారి పేరిట తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి శనివారం తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సారథ్యంలో బుద్ధవనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) తెలిపారు. టూరిజం ప్రమోషన్లో భాగంగా నాగార్జున సాగర్‌లోని బుద్ధవనాన్ని మంత్రి జూపల్లి శనివారం సందర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చూసిన వైసీపీ నేతలు తెలంగాణకు మకాం మార్చారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెలంగాణ సరిహద్దులోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో కృష్ణపట్టె గ్రామాలు, సమీప పట్టణాల్లో తిష్ఠవేశారు.
అది నల్లగొండ జిల్లా కేంద్రంలోని 12వ వార్డు పాతబస్తీ..! 1,500 కుటుంబాలకు మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు ద్వారా తాగునీరు అందుతోంది. కొన్నాళ్లుగా తాగునీటిలో దుర్వాసన వస్తోందంటూ కొందరు స్థానికులు మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మునిసిపల్ సిబ్బంది ట్యాంక్ ఎక్కి తనిఖీ చేస్తే.. నీటిలో మృతదేహం తేలియాడుతూ కనిపించింది.
నీటి వాటర్ ట్యాంక్‌ను చూసి జనం షాక్‌కు గురయ్యారు. అందులో ఏముందని చూస్తే అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీరా అందులో మృతదేహం ఉందని చూసి భయాందోళనలకు గురవుతున్నారు.
ఆ రోజు పనికి వెళ్లకపోతే మరుసటి రోజు ఐదువేళ్లు నోట్లోకి వెళ్లలేని స్థితిలో కూడా ఉన్నంతంలో సంతోషంగా గడుపుతున్న ఆ కుటుంబానికి క్యాన్సర్ మహమ్మారి ఆ సంతోషం కూడా లేకుండా చేసింది. ఇంటిపెద్ద భార్య కు క్యాన్సర్ సోకడంతో వైద్యం కోసం ఇప్పటికే లక్షల్లో ఖర్చు పెట్టారు.
ఏడాదిగా నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎ్‌స)లో యంత్ర పరికరాలు, జీఐ బండిల్స్, అల్యూమినియం షీట్లు ఏడాదిన్నరగా చోరీ అవుతున్నాయి. వైటీపీఎ్‌సలో చొరబడుతున్న దొంగలు, విలువైన వస్తువులను స్ర్కాప్‌గా అమ్ముకొని కోట్లలో సొమ్ము చేసుకుంటున్నట్లుగా ఆరోపణలొచ్చాయి.