Share News

Viral Video: మామగారిని చితక్కొట్టిన కోడలు.. వీడియో వైరల్

ABN , Publish Date - Dec 08 , 2024 | 04:52 PM

ఈ దాడి ఘటనపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. 'మానవత్వమా నీ జాడెక్కడ.? మూగజీవులకు ఉన్న మానవత్వం కూడా మనిషికి లేదా..?. ఎటు పోతోందీ సమాజం.?. ఇలాంటి సమాజంలో మనుగడ సాగిస్తున్నామా.. అని తలుచుకుంటేనే బాధేస్తోంది.' అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

Viral Video: మామగారిని చితక్కొట్టిన కోడలు.. వీడియో వైరల్

సూర్యుని చుట్టూ భూమి తిరుగుతోంటే.. అందులో నివసించే మనుషులు మాత్రం డబ్బు చుట్టూ తిరుగుతోన్నారు. అందుకే వారి బంధాలు లేవు. అనుబంధాలు లేవు. కేవలం రుణాను బంధాల మాటున ఆర్థిక సంబంధాలే దాగి ఉన్నాయి. ఆ రుణాను బంధాల్లో భాగంగా జన్మించిన పిల్లలకు విద్యా బుద్దులు నేర్పించి.. పెరిగి పెద్దయిన అనంతరం వారికి తగిన జోడిని చూసి వివాహం చేసి.. ఆస్తిలో వాటాను సైతం రాసి ఇస్తున్నారు. అయితే ఇచ్చిన ఆస్తిలో తమకు వాటా తక్కువైందంటూ మామగారిపై చెప్పుతో దాడికి దిగింది ఓ కోడలు.

Also Read: కుంకుడు కాయలతో తల స్నానం చేయడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


కన్న తండ్రి లాంటి మామగారిపై సదరు మహిళ చెప్పుతో దాడికి దిగితే.. ఆ సమీపంలో ఉన్న కుక్క సైతం ఆ దాడిని అడ్డుకోబోయింది. కనీసం మనుషుల్లో లేని మానవత్వం మూగ జీవుల్లో నైనా ఇంకా మిగిలి ఉందని ఆనంద పడాలా? లేకుంటే.. మానవత్వం మంట కలిసి పోతుందని బాధపడాలో తెలియడం లేదు. అయితే ఈ దాడికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా ఐపీఎస్ సీనియర్ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సైతం ఈ వీడియోపై స్పందించి.. కామెంట్ చేశారు.

Also Read: వస్తే గౌరవం పెరుగుతోంది.. లేకుంటే..


ఇంతకీ ఏం జరిగిందంటే..

నల్గొండ జిల్లా వేములపల్లి (Vemulapalli) మండలం శెట్టిపాలేనికి చెందిన గక్కినెపల్లి బుచ్చిరెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరికీ వివాహమైంది. ఆ క్రమంలో తనకు ఉన్న తొమ్మిది (9) ఎకరాల భూమిలో 6 ఎకరాలు ఇద్దరు కుమారులకు ఇచ్చి.. మిగతా 3 ఎకరాలు తన జీవనోపాధి కోసం తన వద్దే బుచ్చిరెడ్డి అట్టెపెట్టుకున్నారు. అయితే ఇటీవల చిన్న కుమారుని కొడుకు దినేశ్ రెడ్డికి 3 ఎకరాల భూమిని బుచ్చిరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ క్రమంలో వీరి మధ్య భూ వివాదం ఏర్పడింది. తమకు తక్కువ వాటా ఇచ్చారంటూ మామగారు బుచ్చి రెడ్డిపై పెద్దకోడలు మణిమాల.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ క్రమంలో గత నెల.. నవంబర్ 20 తేదీన మామ బుచ్చిరెడ్డి ఇంటి వద్ద వీల్ ఛైర్‌లో కూర్చొని ఉండగా.. ఆయనపై చెప్పుతో విచక్షణారహితంగా దాడికి దిగింది.


అడ్డుకున్న కుక్క..

తనను కొట్టొద్దంటూ మామ బుచ్చిరెడ్డి.. కాళ్లు పట్టుకుని వేడుకున్నా కోడలు మణిమాల మాత్రం కనికరించ లేదు. అతని ముఖంపై విచక్షణ రహితంగా చెప్పుతో దాడి చేసింది. ఆయన మొఖం అటు, ఇటూ తిప్పుకొంటున్నా.. చెప్పుతో దాడి చేస్తూనే ఉంది. అయితే ఆ సమీపంలో ఓ కుక్క ఆ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కనీసం ఆ మూగజీవి చూపించిన జాలైనా ఆమె చూపించ లేదు. ఇక ఆ సమీపంలోని సీసీ కెమెరాలో ఈ దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కనీసం మానవత్వం లేకుండా ఓ కుక్కకున్న విశ్వాసం కూడా ఆ కోడలుకి లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమెను కఠినంగా శిక్షించాలంటూ కామెంట్స్ సైతం వారు చేస్తున్నారు.


స్పందించిన ఆర్టీసీ ఎండీ..

ఇక ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. 'మానవత్వమా నీ జాడెక్కడ.? మూగజీవులకు ఉన్న మానవత్వం కూడా మనిషికి లేదా..?. ఎటు పోతోందీ సమాజం.?. ఇలాంటి సమాజంలో మనుగడ సాగిస్తున్నామా.. అని తలుచుకుంటేనే బాధేస్తోంది.' అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

For Telangana News And Telugu news

Updated Date - Dec 08 , 2024 | 05:14 PM