Share News

Minister Komatireddy: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Dec 31 , 2024 | 04:05 PM

Minister Komatireddy Venkatareddy: ఎస్ఎల్‌బీసీ పనుల ప్రాజెక్ట్‌ ఆలస్యంపై అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. SLBC, బ్రాహ్మణవెళ్లాంల ప్రాజెక్ట్‌లు తనకు తొలి ప్రాధాన్యమన్నారు. SLBC ఒక వరల్డ్ వండర్.. SLBC పూర్తయితే.. ప్రపంచమంతా వచ్చి చూస్తుందని అన్నారు.

Minister Komatireddy: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్
Minister Komatireddy Venkatareddy

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెటైరికల్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ రెండు రోజులు ఎంజాయ్ చేయనివ్వండి అని అన్నారు. కొత్త సంవత్సరం రోజు కేటీఆర్‌ను బాధ పెట్టకండి అని చెప్పారు. న్యూ ఇయర్ రోజు ఎంజాయ్ చేయనీయాలని అన్నారు. కేటీఆర్ గురించి 3, 4 వ తేదీల్లో చూద్దామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. జలసౌధలో ఇవాళ(మంగళవారం) నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నల్గొండ పార్లమెంటు పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

నల్గొండ ప్రజల దశాబ్దాల కల ఎస్ఎల్‌బీసీ(SLBC) ప్రాజెక్ట్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే కాంట్రాక్టర్లు పనిచేయరని హెచ్చరించారు. కాంట్రాక్టర్ పని చేయకపోతే సంబంధిత మంత్రికి చెప్పాలన్నారు. దయచేసి అధికారులు కంటితుడుపు పనులు చేసే ప్రయత్నం చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. అధికారులు సీరియస్‌గా పని చేస్తే అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేయొచ్చని చెప్పారు. SLBC ప్రాజెక్ట్ 4 లక్షల ఎకరాలకు నీళ్లిచే ప్రాజెక్ట్ అని వివరించారు.


SLBC, బ్రాహ్మణవెళ్లాంల ప్రాజెక్ట్‌లు తనకు తొలి ప్రాధాన్యమన్నారు. SLBC ఒక వరల్డ్ వండర్.. SLBC పూర్తయితే.. ప్రపంచమంతా వచ్చి చూస్తుందని అన్నారు. అధికారులు చాలా బాధ్యతతో పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తన బ్రదర్ 26 బోర్లు వేసినా నీళ్లు రాలేక వేసిన పంట వదిలేశారని.. నల్గొండ అంత విపత్కర పరిస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. SLBC ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి, డిప్యూటీ సీఎం అందరూ సపోర్ట్ చేస్తున్నారన్నారు. అమెరికా ఇంజనీర్లతో కలిసి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏం కావాలన్నా చేసే మంత్రి ఉన్నారని గుర్తుచేశారు. చిన్న చిన్న సమస్యలతో పనులు ఆపడంపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత ఆలస్యం అయితే. అంత ఖర్చులు పెరుగుతాయన్నారు. అమెరికన్ ఇంజినీర్లు ఆనాడు మిషన్ అమర్చిన రోజు మూడు రోజులు ప్రాజెక్ట్ దగ్గరే ఉన్నానని చెప్పారు. SLBC పూర్తి అయితే, ఫర్ షోర్ నుంచి... నీళ్లు తీసుకోవచ్చని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.


SLBC ప్రపంచంలోనే అతిపొడవైన నీటిపారుదల టన్నెల్ అని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కొట్లాడి తాను 2005లో పాలన అనుమతి ఇప్పించానని గుర్తుచేశారు. SLBC పనులు మొదలు పెట్టామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు వృథా చేశారని మండిపడ్డారు. మార్చిలో SLBC పనులు మొదలవుతాయని తెలిపారు. 20నెలల్లో టన్నెల్ తవ్వకం పనులు పూర్తి అవుతాయిని చెప్పారు. నల్గొండను రాబోయే నాలుగేళ్లలో ఉభయ గోదావరి జిల్లాలను మించి సస్య శ్యామలం చేస్తామని అన్నారు. ఆంధ్ర పాలకులే నల్గొండకు న్యాయం చేశారని చెప్పారు. పదేళ్లు నల్గొండ జిల్లాకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. వేముల ప్రశాంత్ రెడ్డి ఫామ్ హౌస్‌కు, ప్రగతి భవన్‌కు మంత్రిగా పనిచేశారని విమర్శించారు. ఆయనకు రోడ్ల గురించి ఏం తెలుసు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు.


కేసీఆర్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Minister-Uttam.jpg

కేసీఆర్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తిగా నిర్మాణం చేయలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసి...నామమాత్రం ఆయకట్టు మాత్రమే చేశారని చెప్పారు. పాలమూరు రూ.27వేలు, సీతారామ ప్రాజెక్టు రూ.8వేలు ఖర్చు చేసి ఒక్క ఎకరా ఆయకట్టు కూడా ఇవ్వలేదన్నారు. 800 టీఎంసీల తెలంగాణకు 299 టీఎంసీ, ఆంధ్రాకు 519 టీఎంసీ గతంలో ఒప్పుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 500 టీఎంసీ నీళ్ల కోసం సర్కార్ ఫైట్ చేస్తోందని చెప్పారు. సమక్క సారలమ్మ 44 టీఎంసీలు త్వరలోనే క్లియర్ కాబోతున్నాయన్నారు.. రాబోయే ఐదేళ్లలో రికార్డు స్థాయిలో కొత్త ఆయకట్టు తేవాలని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 18వందల లష్కర్‌లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించబోతున్నామని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు.ఇరిగేషన్ శాఖలో పదోన్నతులు వచ్చే పది నెలల్లో పూర్తి చేస్తామన్నారు. అధికారులు బాధ్యతగా ఉండకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ ఏఈనీ సస్పెండ్ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Happy New Year 2025: ఫుల్ కిక్‌లో మందుబాబులు.. మూడ్రోజుల్లో ఎంత తాగారంటే..

KTR: మరోసారి కాంగ్రెస్ సర్కార్‌పై దుమ్మెత్తిపోసిన కేటీఆర్

Metro Rail: మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్

For More Telangana And Telugu News

Updated Date - Dec 31 , 2024 | 04:55 PM