Home » Nalgonda
ఎన్నికల విధుల నిర్వహణలో సక్రమంగా నిర్వర్తించాలని సహాయ రిట్నరింగ్ అధికారి, ఆర్డీవో శ్రీనివాసరావు సూచించారు.
యాదాద్రి: జగత్కల్యాణ కారకుడు, భక్తజనబాంధవుడు, ఆర్తత్రాణపరాయణుడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
Telangana: అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు వరుసగా గులాబీ పార్టీని వీడుతుడంటం కలవరానికి గురిచేస్తోంది. నిన్నటి నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరగా... తాజాగా మరో మాజీ ఎమ్మెల్సీ కూడా పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ తెరా చిన్నప రెడ్డి బీఆర్ఎస్ను వీడి బీజేపీలోకి వెళ్లే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. నిన్నటి వరకు నల్లగొండ ఎంపీ టిక్కెట్‌ను తెరా చిన్నప రెడ్డి ఆశించారు.
Telangana: కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పుల్‌స్టాప్ పెట్టారు. శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో గుత్తా మాట్లాడుతూ.. తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని మీటింగుల్లో మాత్రమే కలిసినట్లు తెలిపారు.
యాదాద్రి: తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కొండపై నిద్రించే సౌకర్యాన్ని ఆలయ అధికారులు కల్పించారు. కొండపైన డార్మెటరీ హాల్‌ను ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రారంభించారు.
Telangana: బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటే అన్న వారిని చెప్పుతో కొడతామని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, లింగోజి గూడెం గ్రామాల్లో బూర నర్సయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘‘నాకంటే ముందున్న ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు భువనగిరి పార్లమెంట్లో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా’’ అంటూ సవాల్ విసిరారు.
Telangana: యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖకు చిన్న పీటలు వేసి అవమానించారని ఆ ఘటన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యాదగిరిగుట్ట ఆలయంలో పీటల వివాదంపై అధికారుల అలెర్ట్ అయ్యారు.
యాదాద్రి: భక్తుల ఇలవేల్పు దైవం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నాల్గవ రోజు గురువారం ఉదయం వట పత్ర శాయి అలంకార సేవలో లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
Telangana: ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని... ఊళ్లకు పోతే నీళ్ల సమస్యలతో కళ్ళలో నీళ్లు వస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. డబ్బుల ఆశతో కేసీఆర్, అల్లుడు, కొడుకులు... హైదరాబాద్‌లో టానిక్ షాపులు, ఢిల్లీలో మందు షాపులు, కాళేశ్వరం పేరుతో దోపిడీ చేసి దక్షిణ తెలంగాణను నాశనం చేశారని విమర్శించారు. అందుకే రిజల్ట్ వచ్చిన రోజే కేసీఆర్ నడుము విరగ్గొట్టి దేవుడు శిక్ష వేశారన్నారు.
Telangana: యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి సన్నిధిలో బ్రహోత్సవాలు ఘనం జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రేవంత్‌కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో సీఎం దంపతులు, మంత్రుల బృందం పాల్గొన్నారు.