Yadadri: యాదాద్రి భక్తులకు శుభవార్త.. కీలక ప్రకటన చేసిన అధికారులు..
ABN , Publish Date - Mar 15 , 2024 | 09:26 AM
యాదాద్రి: తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కొండపై నిద్రించే సౌకర్యాన్ని ఆలయ అధికారులు కల్పించారు. కొండపైన డార్మెటరీ హాల్‌ను ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రారంభించారు.
యాదాద్రి: తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి (Sri Lakshminarasimha Swamy) భక్తులకు (Devotees) ప్రభుత్వం శుభవార్త (Good News) అందించింది. స్వామి కొండపై నిద్రించే సౌకర్యాన్ని ఆలయ అధికారులు కల్పించారు. కొండపైన డార్మెటరీ హాల్‌ను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రారంభించారు. సుమారు 1000 మంది భక్తులు నిద్రించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక నుంచి భక్తులు యాదాద్రి కొండపై నిద్రించి మొక్కులు తీర్చుకోవచ్చు. ఈ సౌకర్యంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా భక్తుల ఇలవేల్పు దైవం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu)వైభవంగా జరుగుతున్నాయి. క్షేత్రాభివృద్ధిలో భాగంగా ఆలయ ఉద్ఘాటన జరిగిన తర్వాత రెండోసారి జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈనెల 21వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.