TG Politics: బీఆర్‌ఎస్‌కు షాక్.. పార్టీకి మాజీ ఎమ్మెల్సీ గుడ్ బై?
ABN , Publish Date - Mar 16 , 2024 | 12:47 PM
Telangana: అధికారం కోల్పోయాక బీఆర్‌ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు వరుసగా గులాబీ పార్టీని వీడుతుడంటం కలవరానికి గురిచేస్తోంది. నిన్నటి నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరగా... తాజాగా మరో మాజీ ఎమ్మెల్సీ కూడా పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ తెరా చిన్నప రెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలోకి వెళ్లే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. నిన్నటి వరకు నల్లగొండ ఎంపీ టిక్కెట్‌ను తెరా చిన్నప రెడ్డి ఆశించారు.
నల్గొండ, మార్చి 16: తెలంగాణలో అధికారం కోల్పోయాక బీఆర్‌ఎస్ పార్టీకి (BRS) షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) సమీపిస్తున్న వేళ పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు వరుసగా గులాబీ పార్టీని వీడుతుడటం కలవరానికి గురిచేస్తోంది. నిన్నటికి నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad MLA Danam Nagender) పార్టీని వీడి కాంగ్రెస్‌లో (Congress) చేరగా... తాజాగా మరో మాజీ ఎమ్మెల్సీ కూడా పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ తెరా చిన్నప రెడ్డి (Former MLC Tera Chinnapa Reddy)బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలోకి (BJP) వెళ్లే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. నిన్నటి వరకు నల్లగొండ ఎంపీ టిక్కెట్‌ను తెరా చిన్నప రెడ్డి ఆశించారు. అయితే ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అరెస్ట్.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ దూరంగా ఉండాలని తెరా చిన్నప రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి మాజీ ఎమ్మెల్సీ టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. అయితే ఇప్పటికే నల్గొండ ఎంపీ అభ్యర్థిగా సైదిరెడ్డిని బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. సైదిరెడ్డికి టికెట్ వద్దని నల్గొండ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్సీ తెరా చిన్నప రెడ్డి పార్టీలో చేరితే టికెట్ మార్చి ఆయనకు ఇచ్చే ఛాన్స్ ఉందా అనేది ఆసక్తికర అంశంగా మారింది.
ఇవి కూడా చదవండి...
Hyderabad: బీఆర్‌ఎస్‌కు గడ్డుకాలం.. కాంగ్రెస్, బీజేపీ వైపు నేతల చూపు.. కవిత అరెస్ట్‌తో మరో షాక్
PM Modi: మరోసారి బీజేపీ ప్రభుత్వమే.. తెలంగాణలో కూడా ఇదే ఫలితం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..