Home » Nara Bhuvaneswari
పార్వతీపురం జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు కావడాన్ని తట్టుకోలేక మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఆమె ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు.
Andhrapradesh: జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది. ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు రూరల్ మండలం, ముత్తుకూరు గ్రామంలో పార్టీ కార్యకర్త మోహన్ నాయుడు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు.
చిత్తూరు జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చిత్తూరు, జీడీ నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో ఆమె పర్యటించనున్నారు.
Andhrapradesh: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమం రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు (గురువారం) పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లో భువనమ్మ పర్యటించనున్నారు.
Andhrapradesh: టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో మహిళలతో భువనమ్మ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు మొట్టమొదటగా అన్ని విధాలగా గౌరవం తీసుకువచ్చింది నందమూరి తారకరామారావే అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్.. మహిళలకు రెగ్యులేషన్ తీసుకొచ్చారన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ ప్రశ్నించారు. ఆమె కుప్పంలో బుధవారం మాట్లాడుతూ.. కుప్పం ప్రజలు బాబుకు మద్దతిస్తారా లేక తనకా అంటూ సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు.
నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో జరగనుంది. కుప్పం నియోజకవర్గం.. గుడిపల్లి మండలం అత్తి నాతం గ్రామానికి నారా భువనేశ్వరి చేరుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఇవాళ, రేపు రెండు రోజుల పాటు నిజం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొననున్నారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం ఉదయం బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనమ్మకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం బెంగుళూరు విమానాశ్రయం నుంచి భువనేశ్వరి కుప్పం బయలుదేరారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu)ను ఏపీ సీఐడీ స్కిల్ డెవెలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసింది. ఈ విషయం తెలియడంతో పలువురు చంద్రబాబు అభిమానులు తీవ్ర మనస్థాపానికి గురై చనిపోయారు.
వైసీపీ నేతలు భారీగా ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) అన్నారు. గురువారం నాడు ‘‘నిజం గెలవాలి’’ (Nijam Gelavali) యాత్ర సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో కొనసాగుతోంది.