Home » Nara Chandra Babu Naidu
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections) సమయం ఆసన్నమైంది. దీంతో ఒక్కసారిగా తెలుగుదేశం (Telugu Desam) పార్టీ ఓల్టేజ్ పెంచింది!. 144 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 17 మంది పార్లమెంట్ అభ్యర్థులను టీడీపీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని నియోజకవర్గాల్లో చేసిన మార్పులు, చేర్పులు.. కూటమికి ఇచ్చిన స్థానాలతో ఆగ్రహావేశాలు ఇలా ఎన్నెన్నో జరిగాయి. ఆఖరికి నామినేషన్లకు సమయం ఆసన్నమైంది. ఆదివారం నాడు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు చంద్రబాబు బీఫామ్‌లు ఇచ్చి.. ప్రమాణం కూడా చేయించారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో ఆదివారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు చంద్రబాబు బీ.ఫామ్స్ ఇస్తున్నారు.
‘సిద్ధం’ సభలు చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు, బస్సులు పరిగెడుతున్నాయని ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM JAGAN అన్నారు. శనివారం నాడు అనకాపల్లి జిల్లాలో ‘మేముసిద్ధం’సభలో చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభలు చూసి టీడీపీ అధినేత చంద్రబాబు భయపడి తన మీద రాళ్లు వేయమంటున్నారని అన్నారు.
మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి (Minister Kakani Govarthan Reddy) కనీసం తన నియోజకవర్గానికైనా న్యాయం చేశారా? అని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. ఇలాంటి వారు మంత్రులు కాబట్టే ప్రజాస్వామ్యం విలవిలలాడుతోందని అన్నారు. శనివారం నాడు సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
జలగన్న జగన్‌కు ఇదివరకు ఇచ్చిన ఆ ఒక్క చాన్సే... చివరి చాన్స్ కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దోపిడీ, విధ్వంసమే సీఎం జగన్ నైజమని మండిపడ్డారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ పత్రాలను ఆయన స్వయంగా కాకుండా.. సతీమణి నారా భువనేశ్వరితో (Nara Bhuvaneshwari) నామినేషన్ దాఖలు చేయిస్తున్నారు. మధ్యాహ్నం 01:27 గంటలకు రిటర్నింగ్ అధికారికి భువనేశ్వరి నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు..
కర్నూలు జిల్లా: ప్రజాగళం యాత్రంలో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కర్నూలు జిల్లా, ఆలూరులో పర్యటించనున్నారు. ఆలూరు అంబేద్కర్ సెంటర్లో సాయంత్రం మూడు గంటలకు ప్రజాగళం సభలో పాల్గొంటారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కుప్పంలో చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. చంద్రబాబు తరపున రెండు సెట్ల నామినేషన్‌ను ఆమె దాఖలు చేయనున్నారు.
కృష్ణా జిల్లా: వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో జగనాసుర వధ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు పిలుపిచ్చారు. పెడన సభలో వైసీపీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. సీఎం జగన్ ఐదేళ్లపాటు పరదాలు కట్టుకుని తిరిగారంటూ ఎద్దేవా చేశారు.
విజయవాడ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవణ్ కల్యాణ్ బుధవారం కృష్ణా జిల్లాలో ఉమ్మడి ప్రచారం చేయనున్నారు.