Share News

TDP: చంద్రబాబు నివాసానికి వచ్చిన గిడ్డి ఈశ్వరి, ఎంఎస్ రాజు, రఘురామ..

ABN , Publish Date - Apr 21 , 2024 | 01:30 PM

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో ఆదివారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు చంద్రబాబు బీ.ఫామ్స్ ఇస్తున్నారు.

TDP: చంద్రబాబు నివాసానికి వచ్చిన గిడ్డి ఈశ్వరి, ఎంఎస్ రాజు, రఘురామ..

అమరావతి: సార్వత్రిక ఎన్నికల (Elections) నేపథ్యంలో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో ఆదివారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత (TDP Chief) చంద్రబాబు (Chandrababu) నివాసంలో తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసే అసెంబ్లీ (Assembly), పార్లమెంట్ (Parliament) అభ్యర్థులకు చంద్రబాబు బీ.ఫామ్స్ (B forms) ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసానికి గిడ్డి ఈశ్వరి (Giddi Eswari), ఎంఎస్ రాజు (MS Raju), రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) వచ్చారు. పాడేరు టీడీపీ అభ్యర్థిగా ఇప్పటికే రమేష్ నాయుడు పేరు తెలుగుదేశం ప్రకటించింది. అయితే పాడేరు అభ్యర్థిగా తనకు పోటీ చేసే అవకాశం చంద్రబాబు కల్పించారని గిడ్డి ఈశ్వరి అన్నారు. తనకు అవకాశం కల్పించిన చంద్రబాబు, లోకేష్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ.. బీ.ఫామ్ తీసుకునేందుకు వచ్చానని అన్నారు.


అలాగే మడకశిర స్థానం ఆశిస్తున్న ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు కూడా ఆదివారం ఉదయం చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీ.ఫామ్ కార్యక్రమానికి రావాల్సిందిగా అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిన నేపథ్యంలో తాను చంద్రబాబు నివాసానికి వచ్చానని ఎంఎస్ రాజు తెలిపారు.


మరోవైపు రఘురామకృష్ణంరాజు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ వేస్తున్నానని, బీ.ఫామ్ తీసుకోవాలని అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు మేరకు తాను చంద్రబాబు నివాసానికి వచ్చానని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు.


కాగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో బీ.ఫామ్స్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడు నుంచి బీ.ఫామ్స్ పంపిణీ ప్రారంభమైంది. ముందు పార్లమెంట్, తర్వాత అసెంబ్లీ అభ్యర్థులకు చంద్రబాబు బీ.ఫామ్స్ ఇస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బాలుడిని హత్య చేశానంటూ సైకో హల్ చల్

ఖాళీ అవుతున్న గుడివాడ రూరల్ వైసీపీ..

రంగారెడ్డి జిల్లా: నడుస్తున్న కారులో మంటలు..

వెంకటగిరి టిక్కెట్టు విషయంలో టీడీపీ కీలక నిర్ణయం

రాయి తగిలితే హత్యాయత్నం.. గొడ్డలితో నరికితే గుండెపోటా?

పరారే.. పరారే.. పరిశ్రమలు పరారే!

Updated Date - Apr 21 , 2024 | 01:49 PM